జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

ABN , First Publish Date - 2020-08-11T10:31:41+05:30 IST

జిల్లాలో జడి వాన కు రిసింది. ఆదివారం రాత్రి నుంచిసోమవారం రా త్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు

జిల్లావ్యాప్తంగా భారీ వర్షం

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

మత్తడి దుంకుతున్న చెరువులు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లాలో జడి వాన కు రిసింది. ఆదివారం రాత్రి నుంచిసోమవారం రా త్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చా లా చోట్ల పంట చేలల్లోకి, బావులు, చెరువుల్లోకి వర్షపు నీరు చేరింది. మహారాష్ట్ర ఎగువ ఉన్న ప్రాంతాల్లో రెండు, మూడు రోజులుగా భారీ వ ర్షాలు కురవడంతో దిగువన ఉన్న శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. జి ల్లాలో చాలా చోట్ల చెరువుల్లోకి వర్షం నీరు చేర డంతో మత్తడి దుంకుతున్నాయి.


జిల్లాలో భారీ వర్షం

జిల్లాలో భారీ వర్షం కురిసింది. జూన్‌లో వర్షాకాలం సీజన్‌ ప్రారంభమైనప్పటికీ జూలై నెలాఖ రు వరకు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు లే వు. ఛత్తీస్‌ఘడ్‌, విధర్భ ప్రాంతాల్లో అల్పపీడన ఆ వర్తన ద్రోణితో జూలై నెలాఖరు నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ ప్రభావంతో జిల్లా లో ఆదివారం రాత్రి మొదలైన వర్షం సోమవారం రాత్రి వరకు కురుస్తూనే ఉంది. దీంతో ప్రదాన రహదారులపై వర్షం నీరు పొంగి పొర్లాయి. లో తట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి సూమారు 36 వేల క్యూసె క్కుల వరద నీరు చేరడంతో ప్రాజెక్టు నీటితో కల కలలాడుతోంది. జిల్లాలోని చెరువులు, కుంటలు, బావుల్లోకి నీరు చేరింది.


జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌, మోతె చెరువుల్లోకి వర్షం నీరు చేరడంతో మత్తడిపై నుంచి నీరు పంట పోలా ల్లోకి వెళ్లాయి. అత్యధికంగా మెట్‌పెల్లి మండలం లో 34.0 మీ.మీ. వర్షం కురిసింది. రాయికల్‌లో  19.4 మి.మీ., సారంగాపూర్‌లో 26.8 మి.మీ., జగిత్యాలలో 17.4 మి.మీ. వెల్గటూర్‌లో 8.6మి.మీ., మేడిపల్లిలో 28.2 మి.మీ. గొల్లపల్లిలో 14.6 మి. మీ. ఇబ్రహీంపట్నంలో 28.0 మి.మీ.ల వర్షం కు రిసింది. ధర్మపురిలో 18.2మి.మీ. మల్యాలలో 23. 4 మి.మీ., పెగడపల్లిలో 22.0 మి.మీ., కొడిమ్యాలలో 30.0 మి.మీ.ల వర్షం నమోదైంది. కోరుట్లలో 30.6 మి.మీ. కథలాపూర్‌లో 26.2 మి.మీ. మల్లాపూర్‌లో 28.0 మి.మీ.ల వర్షం కురిసింది. భారీ వర్షాలతో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని టవర్‌ సర్కిల్‌, బుడ గ జంగాల కాలనీ, నాగేంద్రనగర్‌ కాలనీ సమీపంలో వర్షపు నీరు చేరింది. అలాగే డీఈవో, డీ పీవో, ఆర్టీసీ బస్టాండ్‌, పాత బస్టాండ్‌, ఆగ్రోస్‌ భవన్‌ల వద్ద పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలువడంతో ప ట్టణ ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు.


అన్నదాతల్లో ఆనందం..

జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవపాయ బావులు, చెరువు లు, కుంటల్లోకి వర్షపు నీరు చేరడంతో వ్యవసా య పనులను రైతులు మరింత వేగవంతం చే స్తున్నారు. జిల్లాలో ఎక్కడ చూసిన రైతులు వ్యవ సాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Updated Date - 2020-08-11T10:31:41+05:30 IST