ఇళ్లు ఖాళీ చేయండి..

ABN , First Publish Date - 2020-09-27T09:41:43+05:30 IST

భారీ వర్షాల కు హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం పెరుగుతుండటంతో శనివా రం రాత్రి ఏ క్షణంలో అయినా మూసీలోకి

ఇళ్లు ఖాళీ చేయండి..

మూసీ నీటిని వదులుతున్నారు.. 

పరీవాహక ప్రాంతాలు వదిలి వెళ్లాలి

ముసానగర్‌, శంకర్‌నగర్‌వాసులకు పోలీసుల హెచ్చరిక 


చాదర్‌ఘాట్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల కు హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం పెరుగుతుండటంతో శనివా రం రాత్రి ఏ క్షణంలో అయినా మూసీలోకి నీటిని వదలనున్నారని, పరీవాహక ప్రాంతాల్లోని వారు ఇళ్లు ఖాళీ చేయాలని చాదర్‌ఘాట్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి కింద ఉన్న మూసానగర్‌, ఓల్డ్‌మలక్‌పేట డివిజన్‌లోని శంకర్‌నగర్‌ మురికివాడలలో నివాసముంటున్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాలంటూ హెచ్చరించారు. మూసీలోకి నీటిని విడుద ల చేస్తే మూసానగర్‌లో వందకు పైగా ఇళ్లు, శంకర్‌నగర్‌ మురికివాడలో 350కి పైగా ఇళ్లు ముంపునకు గురయ్యే అవకాశముందని ముందుగానే గుర్తించిన అంబర్‌పేట మండలం రెవెన్యూ అధికారులు, చాదర్‌ఘాట్‌ పోలీసులు ఈ మేరకు పరీవాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.  


నిండుకుండలా బైరామల్‌గూడ చెరువు కట్ట తెగితే  పెను ప్రమాదం  

చంపాపేట డివిజన్‌లోని బైరామల్‌గూడ చెరువు పూర్తిస్థాయిలో నిండింది. చెరువు తూర్పు వైపున నీళ్లు వెళ్లేందుకు కొంత మేరకు కట్టను తొలగించారు. ఇటీవల సుందరీకరణ పనుల కోసం చెరువు మట్టిని తీసి కట్టపైనే వేశారు. అయినా, మరోసారి భారీ వర్షం కురిస్తే కట్టకు ప్రమాదం ఏర్పడనుంది. కట్ట తెగితే లింగోజిగూడ డివిజన్‌లోని ఆల్తా్‌ఫనగర్‌, ధర్మపురికాలనీ, కాకతీయకాలనీ, సౌభాగ్యనగర్‌, మైత్రీనగర్‌కాలనీలు మునిగిపోయే ప్రమాదం నెలకొంది. అధికారులు స్పందించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.       


వృద్ధ దంపతులకు చేయూత 

దిల్‌సుఖ్‌నగర్‌: కోదండరామ్‌నగర్‌లోని ఓ ఇంట్లోకి వరదనీరు నీరు చేరడంతో అందులో ఉండే వృద్ధ దంపతులు చిక్కుకుపోయారు. మాజీ కౌన్సిలర్‌ ప్రేమ్‌నాథ్‌గౌడ్‌ యువకుల సహాయంతో వారిని మొదటి అంతస్తుపైకి తీసుకొచ్చి, కుర్చీలో కూర్చోబెట్టి.. కుర్చీలు ఎత్తి మరో ఇంట్లోకి తరలించారు. 

Updated Date - 2020-09-27T09:41:43+05:30 IST