‘హలో బీసీ.. ఛలో ఢిల్లీ’ పోస్టర్‌ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2021-07-22T06:51:56+05:30 IST

జాతీయస్థాయిలో బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న ‘హలో బీసీ-ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి సంబంధించి వాల్‌పోస్టర్‌ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టులో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లబ్ధిక మలేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

‘హలో బీసీ.. ఛలో ఢిల్లీ’ పోస్టర్‌ ఆవిష్కరణ
ఛలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య

రాజమహేంద్రవరం సిటీ, జూలై 21: జాతీయస్థాయిలో బీసీ హక్కుల సాధన కోసం ఈ నెల 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న ‘హలో బీసీ-ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి సంబంధించి వాల్‌పోస్టర్‌ బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్‌.కృష్ణయ్య ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ఎయిర్‌పోర్టులో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  లబ్ధిక మలేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. చట్టసభల్లో బీసీలకు 56శాతం రిజర్వేషన్‌ అమలులో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయన్నారు. హలో బీసీ-ఛలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. 26న ఢిల్లీలో జంతర్‌మంతర్‌వద్ద ధర్నా, 26న మోదీ, అమిత్‌షాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.

Updated Date - 2021-07-22T06:51:56+05:30 IST