Budget 2022: వేటి ధరలు పెరుగుతాయ్..? ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయంటే..!

ABN , First Publish Date - 2022-02-01T19:49:47+05:30 IST

2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Budget 2022: వేటి ధరలు పెరుగుతాయ్..? ఏఏ వస్తువుల ధరలు తగ్గుతాయంటే..!

న్యూఢిల్లీ: 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్‌ అంచనాలు రూ.39 లక్షల కోట్లు అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, ఈ బడ్జెట్‌‌లో తమకు మేలు చేకూర్చే నిర్ణయం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. ఆదాయపన్ను మినహాయింపులపై ఎలాంటి ప్రకటన రాలేదు. 5జీ సేవలు, ఈ-పాస్‌పోర్ట్, క్రిఫ్టో కరెన్సీపై ట్యాక్స్, డిజిటల్ కరెన్సీ, ఐటీ రిటర్న్స్ దాఖలులో మరో మినహాయింపు, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు డిడక్షన్ పెంపు, విద్యార్థుల కోసం వన్ క్లాస్.. వన్ ఛానల్ మొదలైనవి ఈ బడ్జెట్‌లో కీలక ప్రకటనలుగా నిలిచాయి. ఇక తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరిగితే, మరికొన్నింటి ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అసలు ఏ వస్తువుల ధరలు పెరగనున్నాయి, ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి అనే విషయాలను ఒకసారి పరిలీస్తే..


ధరలు పెరిగేవి..

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు, విదేశీ గొడుగులు, ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, లౌడ్ స్పీకర్లు, స్మార్ట్ మీటర్లు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ బొమ్మల విడి భాగాలు, ఇమిటేషన్ నగలు


ధరలు తగ్గేవి..

రత్నాలు, వజ్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, ఇంగువ, కోకో గింజలు, నిల్వ చేసిన నత్తగుల్లలు, ఇతర మాంసాహారం, మిథైల్ ఆల్కహాల్, ఎసెటిక్ యాసిడ్, కెమెరా లెన్సులు(మొబైల్స్‌లో వాడేవి), తోలు దుస్తులు, పాదరక్షకాలు, పెట్రో కెమికల్స్, తుక్కు ఇనుము


Updated Date - 2022-02-01T19:49:47+05:30 IST