మహిళల్లోనే అధిక ఊబకాయం!

ABN , First Publish Date - 2022-09-10T08:41:46+05:30 IST

దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల్లో ఊబకాయం, పురుషుల కంటే ఎక్కువగా ఉందని జాతీయ..

మహిళల్లోనే అధిక ఊబకాయం!

జాతీయ స్థాయిలోనే కాకుండా తెలంగాణ, ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో 

మహిళల్లోనే అధిక బరువు .. జాతీయ కుటుంబ సర్వే-5లో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దక్షిణాది రాష్ట్రాల్లో మహిళల్లో ఊబకాయం, పురుషుల కంటే ఎక్కువగా ఉందని జాతీయ కుటుంబ సర్వే(ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎ్‌స-5)లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఊబకాయంతో ఉన్న మహిళలు 24శాతం, పురుషులు 22.9శాతం ఉన్నారు. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటకల్లో ఈ వ్యత్యాసం స్వల్పంగా తగ్గింది. 2019 నుంచి 2021 మధ్యలో ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌-5  సర్వే ఆధారంగా హైదరాబాద్‌లోని సామాజిక అభివృద్ధి మండలి దీనికి సంబంధించిన బులెటిన్‌ను తాజాగా విడుదల చేసింది.


ఈ సర్వే కోసం దక్షిణాదిలో 120 జిల్లాల్లో 15-49 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఎంచుకున్నారు. తెలంగాణలో 31 జిల్లాలు, ఏపీలో 13, కర్ణాటకలో 30, కేరళలో 14, తమిళనాడులో 32 జిల్లాల్లో సర్వే జరిపారు. ఇక మతపరంగా జాతీయ స్థాయిలో క్రైస్తవుల్లో 31.2 శాతం ఊబకాయం ఉండగా.. ముస్లిం, హిందూ మహిళల్లోనూ ప్రతి నలుగురిలో ఒకరిలో ఊబకాయం సమస్య ఉంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళల్లో ముస్లిం మహిళల్లో అధిక ఊబకాయ సమస్య ఉంది. జాతీయ స్థాయిలో ఓబీసీల్లో 24.6ు, షెడ్యూల్డ్‌ కులాల్లో 21.6ు, షెడ్యూల్డ్‌ తెగల్లో 12.6ు, ఇతరుల్లో 29.6ు ఊబకాయం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. పట్టణ ప్రాంతాల్లో దక్షిణాది మహిళల్లో జాతీయ స్థాయి కంటే అధికంగా ఊబకాయ సమస్య ఉంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల గ్రామీణ మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయంతో ఉన్నవారే. 

Updated Date - 2022-09-10T08:41:46+05:30 IST