Advertisement
Advertisement
Abn logo
Advertisement

తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం


గరిడేపల్లి రూరల్‌, నవంబరు 29: తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం వస్తుందని తెలంగాణ ఉద్యాన పట్టు పరిశ్రమ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం’ అనే అంశంపై మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో సోమవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధితో పాటు అధిక ఆదాయం సాధించవచ్చని తెలిపారు. తేనెటీగలతో ఆదా యం, ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. శిక్షణ పొందిన యువకులకు ఉద్యాన శాఖ పరంగా ఇతర సబ్సిడీలు ఉంటే యువతకు సాయంగా ఉంటామని తెలిపారు. అనంతరం కేవీకేలోని వివిధ ప్రదర్శన క్షేత్రాలను సందర్శించారు. జీవన ఎరువులు, అజొల్లా, బత్తాయి, మామిడి, నర్సరీ హరిత గృహాల్లో కూరగాయల నారు పెంచడం, వర్మి కంపోస్టు, కోడి పిల్లల పెంపకం, ఫిష్‌ కల్చర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హార్టికల్చర్‌ జాయింట్‌ డైరక్టర్‌ బి. సరోజినిదేవి, పట్టు పరిశ్రమ అధికారి శ్రీధర్‌, నల్లగొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.సంగీతలక్ష్మి, పి.రవింద్రకుమార్‌, డాక్టర్‌ జి.సత్యనారాయణరెడ్డి, బి.లవకుమార్‌, శాస్త్రవేత్తలు సీహెచ్‌. నరేష్‌, కిరణ్‌, డి.నరేష్‌, ఆదర్శ్‌, సుగంధి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement