హిజాబ్‌‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

ABN , First Publish Date - 2022-02-15T18:27:46+05:30 IST

దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న హిజాబ్‌ ఉత్కంఠ మరో రోజు కొనసాగడం అనివార్యమైంది. ఉడుపి జూనియర్‌ కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు హిజాబ్‌తో తరగతులకు రావడంతో ఇతరులు అభ్యంతరం తెలిపిన మేరకు రాష్ట్రమంతటా

హిజాబ్‌‌పై కొనసాగుతున్న ఉత్కంఠ

బెంగళూరు: దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న హిజాబ్‌ ఉత్కంఠ మరో రోజు కొనసాగడం అనివార్యమైంది. ఉడుపి జూనియర్‌ కళాశాలలో ఆరుగురు విద్యార్థినులు హిజాబ్‌తో తరగతులకు రావడంతో ఇతరులు అభ్యంతరం తెలిపిన మేరకు రాష్ట్రమంతటా విస్తరించిన విషయం తెలిసిందే. నెలన్నరకాలంగా హిజాబ్‌లతోనే పాఠశాలకు వెళుతూ క్లాసులకు హాజరుకాని ఆరుగురు విద్యార్థినులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై సోమవారం విచారణ సాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి నేతృత్వంలో సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణ ఎన్‌ దీక్షిత్‌, జస్టిస్‌ ఖాజీ జైబున్నీసా మొయినుద్దీన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థినుల తరపున దేవదత్‌ కామత్‌ వాదించారు. ఆర్టికల్‌ 25ను న్యాయవాది కామత్‌ ప్రస్తావించారు. సెంట్రల్‌ స్కూల్‌లో హిజాబ్‌తోనే తరగతులకు వెళుతున్నారని కామత్‌ వాదించారు. విద్యార్థులు యూనిఫాంకు అనుబంధమైన రంగుతో హిజాబ్‌ ధరించే అంశాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల దాకా సాగింది. హిజాబ్‌ సమస్యకు పరిష్కారం లభించనుందని, కర్ణాటక వ్యాప్తంగానే కాకుండా ఎటువంటి తీర్పు వస్తుందోనని దేశవ్యాప్తంగా ఎదురుచూశారు. అయితే మరింత విచారణలు కొనసాగించాల్సి ఉన్నందున మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేశారు. హైకోర్టు ధర్మాసనం పిటీషన్‌ను వా రం క్రితమే విచారణకు తీసుకుంది. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సమ స్య తీవ్రంగా ఉన్నందున 8, 9 తరగతులతోపాటు పీయూ ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈలోగా విచారణకు తీసుకున్న హైకోర్టు ధర్మాసనం శుక్రవారం నుంచే తరగతులు ప్రారంభించాలని సూచించింది. కానీ ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం సోమవారం 9, 10 తరగతులు ప్రారంభించేలా నిర్ణయించింది. పీయూ, డిగ్రీ తరగతులు మంగళవారం వరకు వాయిదా వేశారు. రాష్ట్రమంతటా 9, 10 తరగతులు యథావిధిగా ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రీ-ఫైనల్‌ పరీక్షలు నిర్వహించారు. కలబురగి జిల్లాలోని ఓ పాఠశాలలో ఓ ప్రత్యేకగదిలో విద్యార్థులు హిజాబ్‌ లేకుండా పరీక్షలు రాశారు. పలుచోట్ల విద్యార్థినులు హిజాబ్‌లతో వచ్చి తరగతి గదిలో వాటిని తొలగించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పాఠశాలల వద్ద పోలీసుల బందబోస్తు కొనసాగింది. శివమొగ్గ, బెళగావిలో ఓ సంఘటన మినహా రాష్ట్రమంతటా పాఠశాలలు యథావిధిగా కొ నసాగాయి. శాసనసభ సమావేశాలకు హిజాబ్‌తోనే హాజరవుతానని ప్రకటించిన కలబురగి ఉత్తర ఎమ్మెల్యే ఖనీజా ఫాతిమా అదే తరహాలోనే వచ్చారు. 

Updated Date - 2022-02-15T18:27:46+05:30 IST