ఇప్పుడు దగ్గరగా హిమాలయాలు... కారణమిదే!

ABN , First Publish Date - 2020-04-04T13:33:26+05:30 IST

పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో లాక్డౌన్ అమలులో ఉంది. జనం ఇళ్లలోనే ఉంటున్నారు.

ఇప్పుడు దగ్గరగా హిమాలయాలు... కారణమిదే!

న్యూఢిల్లీ: పెరుగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో లాక్డౌన్ అమలులో ఉంది. జనం ఇళ్లలోనే ఉంటున్నారు. రోడ్లపై వాహనాలు నడవడం లేదు. కర్మాగారాలు మూసివేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ, లాక్డౌన్ సానుకూల ప్రభావం పర్యావరణంపై కనిపిస్తోంది. దేశంలోని అన్ని నగరాలలో గాలి చాలా పరిశుభ్రంగా మారడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో  పంజాబ్ లోని జలంధర్ ప్రజలు  అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నారు. వీరంతా హిమాలయాల పర్వత శ్రేణిని చూస్తూ ఆనందిస్తున్నారు. గాలి క్లీన్ గా మారిందని చెబుతున్నారు. గతంలో ఇటువంటి దృశ్యం ఎప్పుడూ చూడలేదంటున్నారు. 

Updated Date - 2020-04-04T13:33:26+05:30 IST