అంతర్మథనం!

ABN , First Publish Date - 2020-08-05T10:15:39+05:30 IST

ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రూపొందిస్తున్న ఇళ్ల పట్టాలపై రెవెన్యూ యంత్రాంగం అంతర్గతంగా ..

అంతర్మథనం!

ఇళ్ల పట్టాల రిజిస్ర్టేషన్‌లో గందరగోళం

బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు విరుద్ధంగా రూపకల్పన

జాయింట్‌ రిజిస్ర్టార్‌ హోదాలో పట్టాలు

అభ్యంతరాల నేపథ్యంలో రెవెన్యూ అధికారుల ఆందోళన

న్యాయసమ్మతంగాఅమ్ముకునే హక్కు  లేకపోతే ఇవ్వలేమన్న భావన 

ప్రభుత్వ ఆదేశాలతో ఇస్తున్నా.. కోర్టుకు వెళితే తంటాలు తప్పవని ఆందోళన


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రూపొందిస్తున్న ఇళ్ల పట్టాలపై రెవెన్యూ యంత్రాంగం అంతర్గతంగా  అంతర్మథనం చెందుతోంది. బోర్డు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (బీఎస్‌ఓ)కు విరుద్ధంగా వెళ్లటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకే చేస్తున్నామన్న ధైర్యంతోనూ ఉంటోంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే! దీనినెవరూ కాదనరు! కానీ ఇచ్చే ఇళ్ల పట్టాలు ప్రభు త్వ ఉద్దేశానికి అనుగుణంగా ఉండాలి. ప్రస్తుతం ఇళ్ల పట్టాల వ్యవహారంలో ఇది లోపించిందన్న భావనలో రెవెన్యూ యంత్రాంగం ఉంది. ప్రభుత్వ వ్యవహారం కావటంతో బాహాటంగా ఎక్కడా దీనిపై మాట్లాడటా నికి, ఉన్నతాధికారులతో చర్చించటానికి కానీ సాహ సం చేయలేని పరిస్థితి. దీంతో రెవెన్యూ తహసీల్దార్లు ఉన్నతాధికారులే పట్టించుకోనప్పుడు మనకెందుకులే అనుకుంటున్నా..


బీఎస్‌ఓ వయో లేషన్స్‌ భవిష్యత్తులో తమ మెడకు చుట్టుకుంటాయేమోనని భయపడుతు న్నారు. ఇప్పటికే మరో అంశంపై కోర్టులో ఉండటం, బీఎస్‌ఓ వయో లేషన్స్‌పై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే చట్టం ముందు రెవెన్యూ శాఖ చేతులు కట్టుకునే పరి స్థితి వస్తుందా అని పరేషాన్‌కు గురవుతున్నారు. ప్ర భుత్వం దీనిపై జీఓ ఇచ్చినందున ఏ ఇబ్బందులు లే వన్న భావనలో రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 

Updated Date - 2020-08-05T10:15:39+05:30 IST