పేదలందరికీ ఇళ్లు

ABN , First Publish Date - 2021-07-29T05:10:38+05:30 IST

పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేసే దిశగా జగనన్న హౌసింగ్‌ కాలనీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని

పేదలందరికీ ఇళ్లు
జగన్న కాలనీల ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

ప్రతిష్ఠాత్మకంగా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నాం

గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు

కడప(కలెక ్టరేట్‌), జూలై 28: పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేసే దిశగా జగనన్న హౌసింగ్‌ కాలనీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోందని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సభా భవనంలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద రాష్ట్రంలో సుమారు 31 లక్షల మంది లబ్ధిదారులకు సొంతింటి కలను సాకారం చేస్తూ అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 96 శాతం మంది లబ్ధిదారులు గ్రౌండింగ్‌ పనులను పూర్తి చేసుకొని నిర్మాణాలు చేపట్టారన్నారు. ఇసుక, ఐరన, సిమెంట్‌ ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక రీచల వద్ద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సకాలంలో ఇసుక అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో వందశాతం ఇళ్లను పూర్తి చేసేందుకు అధికారులలంతా కృషిచేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నిర్మాణాలు పూర్తిచేసేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమష్టి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత రెడ్డి మాట్లాడుతూ జగనన్న కాలనీలు ఊరికి చివరలో ఉన్నాయని, అక్కడికి ఆర్టీసీ బస్సులు ఉదయం సాయంత్రం వేళల్లో తిరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ అధికారుల సమన్వయంతో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు స్టీల్‌, మెటల్‌ రవాణాలాంటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేట్టిన విజయరామరాజును డిప్యూటీ సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత వర్మ, ధ్యానచంద్ర, సబ్‌ కలెక్టర్లు పృథ్వీతేజ్‌, కేతనగార్గ్‌, ట్రైనీ కలెక్టర్‌ కార్తీక్‌, కడప మేయర్‌ సురేష్‌ బాబు, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, రమేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-29T05:10:38+05:30 IST