ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-20T03:20:34+05:30 IST

ఆసుపత్రుల్లో జరిగే అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్రిమాపక కేంద్రం అధికారి డీవీ రమణయ్య తెలిపారు.

ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
కావలి ఆసుపత్రిలో అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారులు

కావలి, ఏప్రిల్‌ 19: ఆసుపత్రుల్లో జరిగే అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అగ్రిమాపక కేంద్రం అధికారి డీవీ రమణయ్య తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం పట్టణంలోని కోఆపరేటీవ్‌ కాలనీలో ఉన్న సుధీర్‌ డయాబిటీస్‌, ట్రంకురోడ్డులో ఉన్న ఏరియా వైద్యశాలలో అగ్నిమాపక అధికారులు, సిబ్బంది అగ్నిప్రమాదాలు, వాటి నివారణపై అవగాహన కల్పించారు. ఆసుపత్రుల నిర్మాణంలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా ఆ తర్వాత వాటి నివారణకు అవసరమైన అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏరియా వైద్యశాల ఆర్‌ఎంవో ప్రసూన, సుధీర్‌ డయాబిటీస్‌ డాక్టర్‌ బీ.సుధీర్‌రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది ఎస్‌. వెంకటేశ్వర్లు, షేక్‌.గౌష్‌బాషా, ఈ.రామకృష్ణ, ఎం.శ్రీనివాసులు, పీ.వెంకయ్య, పీ.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

అగ్ని ప్రమాదాలపై అవగాహన 

ఉదయగిరి, ఏప్రిల్‌ 19: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం ప్రభుత్వ వైద్యశాలో రోగులకు, సిబ్బందికి అగ్నిమాపక కేంద్రం అధికారి రమే్‌షబాబు ఆగ్ని ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సందానీబాషా, సుభానీబాషా, మాళవిక, ఆగ్నిమాపక సిబ్బంది తాజుద్ధీన్‌, అంకయ్య, మహబూబ్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-20T03:20:34+05:30 IST