అందరూ ఆస్పత్రికి రావడంతోనే ఒత్తిడి

ABN , First Publish Date - 2021-05-13T06:23:08+05:30 IST

కరోనా బాధితులతోపాటు లక్షణాలు ఉన్నవారు ఇతర వ్యాఽ దులతో బాధపడుతున్న వారు అందరూ జిల్లా ఆస్పత్రికి రావడం వల్లే ఇక్కడ సమస్యలు, ఒత్తి డి పెరుగుతున్నాదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవా రం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 80 శా తం మందికి కరోనా లక్షణాలున్నప్పటికీ సా ధారణ చికిత్సలతోనే నయమవుతుందన్నారు.

అందరూ ఆస్పత్రికి రావడంతోనే ఒత్తిడి

తొలుత కొవిడ్‌ కేర్‌ను 

సంప్రదించాలి

సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ 

వెంకటేశ్వరరావు

అనంతపురం వైద్యం, మే12: కరోనా బాధితులతోపాటు లక్షణాలు ఉన్నవారు ఇతర వ్యాఽ దులతో బాధపడుతున్న వారు అందరూ జిల్లా ఆస్పత్రికి రావడం వల్లే ఇక్కడ సమస్యలు, ఒత్తి డి పెరుగుతున్నాదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవా రం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 80 శా తం మందికి కరోనా లక్షణాలున్నప్పటికీ సా ధారణ చికిత్సలతోనే నయమవుతుందన్నారు. మిగిలిన వారిలో 2 నుంచి 3 శాతం బాధితులకు మాత్రమే ఆస్పత్రిలో చికిత్సలు అవసరమౌతాయన్నారు. అలాంటి వారికి వైద్యులు రక్త పరీక్షలు చేయడం, అవసరమైతే ఎక్స్‌రేలు, సీటీ స్కానలు చేయించి వారికి వ్యాధి తీవ్రతను బ ట్టి చికిత్సలు అందిస్తారన్నారు. జిల్లా ఆస్పత్రికి వస్తున్న సీరియస్‌ కేసులకు ఈ పరీక్షలు చేసి ఒకటి, రెండు, మూడుగా విభజిస్తున్నామన్నా రు. మూడో దశలో ఉన్నవారిని ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నామన్నారు. ఒకటి, రెండు దశల్లో ఉన్నవారికి మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నామన్నారు. జిల్లా ఆస్పత్రిలో 562 మం ది, సూపర్‌ స్పెషాలిటీలో 370 మంది, క్యాన్సర్‌ యూనిట్‌లో 290 మంది ప్రస్తుతం కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారన్నారు. కరో నా లక్షణాలున్నవారు తొలుత కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆ తర్వాత రిపోర్ట్‌ను బట్టి, కొవిడ్‌ సెంటర్‌కు వెళ్లి అక్కడున్న వైద్యు లు, సిబ్బందిని సంప్రదించాలన్నారు. వారు సూచించిన మేరకు కొవిడ్‌ సెంటర్లో గానీ, హోం ఐసోలేషనలో గానీ ఉండి చికిత్స తీసుకుంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి తీవ్రంగా ఉండీ ఇబ్బంది పడుతున్న వారు వెంటనే జిల్లా ఆస్పత్రులకు రాకుండా 104ను సంప్రదిస్తే వారు ఏ ఆసుపత్రికి వెళ్లాలో సూచిస్తారన్నారు. ఆ మేరకు వెళితే సమస్య లేకుండా చికిత్స పొందవచ్చన్నారు. కరోనా సోకిన వారు భయపడకుండా మందులతోపాటు పౌష్టికాహారం, మానసిక ప్రశాంతత పొందితే త్వరగా కోలుకుంటారన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది సమస్య లేదనీ, వచ్చిన వారందరికీ సేవలందిస్తున్నామన్నారు. ఆక్సిజన కొరత కూడా లేదని ఆయన చెప్పుకొచ్చారు.


Updated Date - 2021-05-13T06:23:08+05:30 IST