టిడ్కోలో..కదలిక

ABN , First Publish Date - 2020-11-23T05:23:01+05:30 IST

పట్టణాల్లోని పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద మూడేళ్ల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున టిడ్కో ఆధ్వర్యంలో గృహ సముదాయాలను నిర్మించారు.

టిడ్కోలో..కదలిక

పనుల చేపట్టేందుకు కసరత్తు

మౌలిక వసతులకు రూ.229.39 కోట్లతో అంచనా 

ప్రతిపక్షాల ఆందోళనలతో స్పందించిన ప్రభుత్వం

ఈ సారైనా నిధులు విడుదల చేయాలని లబ్ధిదారుల వినతి


టిడ్కో ఇళ్లపై ప్రతిపక్షాల ఆందోళనలు ప్రభుత్వాన్ని కదిలించాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. నిర్మాణం పూర్తయిన గృహాలకు మౌలిక వసతులు కల్పించే విషయంలో ప్రభుత్వం మౌనం వీడింది. పనుల గుర్తింపునకు ఏపీ టిడ్కో అధికారులను ఆదేశించింది. జిల్లాలోని టిడ్కో గృహాలకు మౌలిక వసతుల కల్పనకు  రూ.229.39 కోట్లతో అంచనాలు రూపొందించారు. జిల్లాలో 14,816 గృహాలను లబ్ధిదారులకు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చిందని అధికారులు తెలిపారు. దీంతో లబ్ధిదారులు గృహ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. 


నరసరావుపేట నవంబరు 22: పట్టణాల్లోని పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద మూడేళ్ల క్రితం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున టిడ్కో ఆధ్వర్యంలో గృహ సముదాయాలను నిర్మించారు. ఈ పథకంలో జిల్లాలో 28,304 గృహాల నిర్మాణం చేపట్టారు. వీటిలో 13,256 ఇళ్ళ నిర్మాణం పూర్తి అయ్యింది. చివరి దశలో  8,890 గృహాలు ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణాలు, మౌలిక వసతులను పక్కన పెట్టేశారు. టిడ్కో ఇళ్లను పాడుపెడుతున్నారని, అప్పులు చేసి తమ వాటా చెల్లించినా తమకు గృహ యోగం లేకుండా చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన చెం దుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇటీవల టీడీపీ, వామపక్షాలు ఆధ్వ ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళలు జరిగాయి. కట్టిన ఇళ్లను పాడు పెట్టడంపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడం.. ఆందోళనలు ఊపం దుకోవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రానున్న క్రిస్మస్‌ కు గృహాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీకి అధి కారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 14,816 గృహాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు తెలిపారు. పూర్తి అయిన ఇళ్లకు మౌలిక వసతులు కల్పించేం దుకు అంచనాలు రూపొందిం చాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు జిల్లాలోని టిడ్కో గృహ సముదా యాల వద్ద మౌలిక వసతుల కల్పనకు రూ.229.39 కోట్ల వ్యయం అవుతుందని ఏపీ టిడ్కో కార్పొరేషన్‌ అంచనా వేసింది. తాగునీరు, డ్రెయినేజి, అంతర్గత రహదారులు, విద్యుత్‌ సౌకర్యాలను పూర్తి చేసి గృహాలను అప్పగించాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్ప టికి రెండు సార్లు మౌలిక వస తులకు అంచనాలు రూపొం దిం చినా ప్రభుత్వం నిధులు విడుద ల చేయలేదు. ఈ సారైనా నిధులు కేటా యిస్తుందో లేదో చూడాలి. నిధులు విడుదలై ఆయా పనులు పూర్తి చేయడానికి కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అంటే పేదలు ఇంకా ఏడాది పాటు అద్దె గృహాల్లోనే నివసించాల్సిన పరిస్థితి నెలకొంది. 


కేవలం రూ.499 తగ్గింపు 

గత ప్రభుత్వం 300 చదరపు అడుగుల ఇంటిని రూ.500లకు మంజూరు చేసింది. ఈ ప్రభుత్వం అదే ఇంటిని ఒక్క రూపా యికి ఇస్తున్నట్టు ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం బాబు ఇల్లు కావాలా? జ గన్‌ ఇల్లు కావాలా? అని లబ్ధిదారులను ప్ర శ్నిస్తున్నది. రెండు పథకాలు ఒక్కటేనని తగ్గించింది రూ.499 మాత్రమేనని లబ్ధి దారులు అంటున్నారు. పూర్తయిన గృహాల ను ఏడాదిన్నరగా పంపిణీ చేయలేదని దీంతో అద్దెలు కట్టలేక ఇబ్బం దులు ఎదుర్కొన్నామన్నారు.  అప్పుడే ఇల్లు ఇచ్చి ఉంటే వేలాది రూపాయలు అదా అయ్యేవని వారు వాపోతున్నారు. రూపాయికి ఇల్లు ఇస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం పనులు పూర్తయ్యే వరకు లబ్ధిదారులకు అద్దె చెలించాలని వారు కోరుతున్నారు. 


మళ్లీ మంజూరు పత్రాల పంపిణీ

గుంటూరు కార్పొరేషన్‌ సహా జిల్లాలోని మున్సిపాలిటీలు, రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరిగాయి. వీటిలో సీఆర్‌డీఏ పరిధిలోని అనంతవరంలో 416, నవులూరులో 672, పెనుమాక లో 608, మందడంలో 448, తుళ్లూరులో 448 గృహాల నిర్మా ణం పూర్తి చేశారు. దొండపాడులో 1184, నిడమర్రులో 544 ఇళ్ల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయి. గతంలోనే లబ్ధి దారు లను ఎంపిక చేసి వారికి ఇళ్లను కూడా వారికి కేటాయించా రు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ఎన్నికలకు ముందు గృహ ప్రవేశాలు కూడా జరిగాయి. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వం మళ్లీ 14,816 గృ హాలకు మంజూరు పత్రాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. 

Updated Date - 2020-11-23T05:23:01+05:30 IST