జిల్లాలో 1.48లక్షల గృహాలు మంజూరు

ABN , First Publish Date - 2021-03-06T05:55:58+05:30 IST

నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాకు లక్షా 48 వేల 526 గృహాలు మంజూరైనట్లు హౌసింగ్‌ జిల్లా పీడీ జీవీ ప్రసాద్‌ తెలిపారు.

జిల్లాలో 1.48లక్షల గృహాలు మంజూరు

హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌

పిఠాపురం రూరల్‌, మార్చి 5: నవరత్నాలు-పేదలందరికి ఇళ్లు పథకంలో భాగంగా జిల్లాకు లక్షా 48 వేల 526 గృహాలు మంజూరైనట్లు హౌసింగ్‌ జిల్లా పీడీ జీవీ ప్రసాద్‌ తెలిపారు. పిఠాపురం మండల పరిషత్‌ కార్యాలయంలో హౌసింగ్‌పై నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 825 లేఅవుట్లలో 1.21లక్షల గృహాలు, సొంత స్థలాలు ఉన్నవారికి 26 వేల గృహాలు, ఎల్‌పీసీలు ఉన్నవారికి 2 వేల గృహాలు మంజూరయ్యాయన్నారు. లే అవుట్లలో 120 గృహాలు, సొంత స్థలాల్లో 3,400 గృహాల నిర్మాణం ప్రారంభమయిందని తెలిపారు. ఒక్కొక్క గృహనిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్‌లో వివరాలు అప్డేట్‌ చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అన్ని లేఅవుట్లలో తాగునీటి సదుపాయం కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హౌసింగ్‌ ఈఈ రఘురామ్‌, డీఈఈ సీహెచ్‌ వెంకట్రావు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఏఈలు  పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:55:58+05:30 IST