మారటోరియంలో ఈఎంఐలు ఎలా వసూలు చేస్తారు

ABN , First Publish Date - 2020-06-05T09:46:07+05:30 IST

ఈఎంఐలపై రిజర్వుబ్యాంకు మారటోరియం విధించినా ఈఎంఐలు ఎలా వసూలు చేస్తారని

మారటోరియంలో ఈఎంఐలు ఎలా వసూలు చేస్తారు

బేగంపేట, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఈఎంఐలపై రిజర్వుబ్యాంకు మారటోరియం విధించినా ఈఎంఐలు ఎలా  వసూలు చేస్తారని సోమాజిగూడలోని బజాజ్‌ ఫైనాన్స్‌ కార్యాలయం వద్ద సుమారు 40మంది గురువారం ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో కుటుంబం గడవడమే కష్టంగా ఉందని, ఈఎంఐలు ఎలా వసూలు చేస్తారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చెల్లించవలసిన మొత్తంపై అధికంగా సర్‌చార్జీ వేశారని, ఒక సారి చెక్‌ బౌన్స్‌ అయితే రూ.590 పెనాల్టీ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  పంజాగుట్ట పోలీసులు అక్కడికి చేరుకుని ఫైనాన్స్‌ సంస్థ అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. పరిశీలించి వారికి న్యాయం జరిగేలా చూస్తామని సంస్థ అధికారులు చెప్పడంతో బాధితులు వెళ్లిపోయారు.  

Updated Date - 2020-06-05T09:46:07+05:30 IST