కొవిడ్‌ ఆసుపత్రిలో విధులు ఎలా నిర్వహించాలి?

ABN , First Publish Date - 2021-05-11T05:43:57+05:30 IST

సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో విధులు ఎలా నిర్వహించాలని సచివాలయ సిబ్బంది అన్నారు.

కొవిడ్‌ ఆసుపత్రిలో విధులు ఎలా నిర్వహించాలి?
మున్సిపల్‌ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన

-ప్రభుత్వ తీరుపై సచివాలయ ఉద్యోగుల ఆందోళన

హిందూపురం టౌన, మే 10: సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో విధులు ఎలా నిర్వహించాలని సచివాలయ సిబ్బంది అన్నారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో జరిగిన సమావేశానికి హాజరైన కొంతమంది సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ఆసుపతిల్రో ఆక్సిజన వారి వైద్యంపై మాకేం తెలుస్తుందని అంతేకాక అక్కడేమైనా జరిగితే అది మాపై వేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో ఆసుపత్రిలో డ్యూటీలు ఎలా చేయాలంటూ సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి బయట బాధ్యత ఏ పని అప్పగించినా చేస్తాం. కానీ కొవిడ్‌ ఆసుపత్రిలో పనిచేయమంటే ఎలా అన్నారు. దీనిపై సబ్‌ కల్టెర్‌కు విన్నవించేందుకు ప్రయత్నించినా సబ్‌ కలెక్టర్‌ వారికి నిరాకరించారు. గర్భవతులకు మినహాయింపు ఉంటుందన్నారు. దీంతో చేసేది లేక సచివాలయ ఉద్యోగులు వెనుతిరిగారు. 


Updated Date - 2021-05-11T05:43:57+05:30 IST