పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేదెలా?

ABN , First Publish Date - 2022-04-06T05:29:19+05:30 IST

ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన నిరుద్యోగ యువతలో ఆశలు నింపింది.

పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేదెలా?
బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు (ఫైల్‌)

- ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు  

- బీసీ స్టడీ సర్కిల్‌లో ప్రారంభం కాని శిక్షణా తరగతులు

- ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 5 : ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన నిరుద్యోగ యువతలో ఆశలు నింపింది. నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోటీ పరీక్షలకు సమాయత్తం అవుతున్న యువతీ యువకులు కోచింగ్‌ సెంటర్ల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్లు ప్రకటనలు గుప్పిస్తూ వారికి ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. కానీ ప్రభుత్వ పరంగా ఉచితంగా శిక్షణ అందించే స్టడీ సర్కిళ్లలో తరగతుల నిర్వహణ ఇప్పటి వరకు ప్రతిపాదన దశల్లోనే ఉన్నాయి. 


జిల్లాలో ఒకే స్టడీ సర్కిల్‌

జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్న ఒకే ఒక్క బీసీ స్టడీ సర్కిల్‌లో ఇప్పటికీ తరగతులు ప్రారంభం కాలేదు. ప్రభుత్వ ఆదేశం కోసం నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. 2018లో ప్రారంభమైన బీసీ స్టడీ సర్కిల్‌లో డైరెక్టర్‌, కో ఆర్డినేటర్లతో కలిపి మొత్తం 12 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 300 వందల మంది అభ్యర్థులు వివిధ రకాల శిక్షణలను పూర్తి చేసుకున్నారు. కాగా, సర్కిల్‌ అద్దె భవనంలోనే కొనసా గుతుండగా, అందులోని మూడు గదులలో రెండింటిని తరగతి గదుల నిర్వహణకు వినియోగిస్తున్నారు. మరో గదిలో పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలను అందు బాటులో ఉంచారు. అయితే స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు రాక పోవడంతో శిక్షణ పొందిన అభ్యర్థులందరూ ఇప్పటికీ ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాలోని ఉపాధి కల్పనా శాఖ కార్యాలయంలో 5,823 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 4,176 మంది యువ కులు, 1,645 మంది యువతులు ఉన్నారు. 


మూడు కేంద్రాల కోసం ప్రతిపాదనలు 

గతంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 12 బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయగా, అందులో ఒకదాన్ని గద్వాలకు కేటాయించింది. గద్వాల బీసీ స్టడీ సర్కిల్‌ పరిధిలో గద్వాల, అలంపూరు, వనపర్తి నియోజకవర్గాలు న్నాయి. ప్రస్తుతం ప్రతీ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కి ల్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. గద్వాల పట్టణంలోని మహా రాణి ఆదిలక్ష్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకటి, అలంపూరు నియోజకవర్గంలోని శాంతినగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వనపర్తి నియోజక వర్గం కోసం అక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కోచింగ్‌ సెంట్రల్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. ప్రతీ కేంద్రంలో మూడు గదులను కేటాయించ నున్నారు. ఒక గదిలో డిజిటల్‌ పాఠాలు, ఇంకో గదిలో అభ్యర్థుల సందేహాల నివృత్తి, మూడో గదిలో పరీక్షలకు సమాయత్తమయ్యే అవకాశం కల్పించనున్నారు. వంద మంది నిరుద్యోగ అభ్యర్థులకు వారి విద్యార్హత ఆధారంగా మెరిట్‌ పద్ధతిలో 75 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీ లకు, పది శాతం ఎస్టీలకు కేటాయించి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీటిలో గ్రూప్స్‌ ఫౌండేషన్‌ శిక్షణ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, డీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలోనే బోధకుల నియామకం చేపట్టి ఆయా కేంద్రాలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


త్వరలోనే తరగతులు ప్రారంభం 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 120 స్టడీసెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. గద్వాలతో పాటు స్థానిక ఎంఏఎల్‌డీ కళాశాల, అలంపూరు, వనపర్తిలలో త్వరలోనే కేంద్రాలను ప్రారంభించి నిరుద్యోగ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణను అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. మొత్తం 100 మంది అభ్యర్థులు వస్తే తరగతులను ప్రారంభిస్తాం.

- టీ ప్రవీణ్‌,  డైరెక్టర్‌, గద్వాల బీసీ స్టడీ సర్కిల్‌



Updated Date - 2022-04-06T05:29:19+05:30 IST