Advertisement
Advertisement
Abn logo
Advertisement

చర్మంపై ఉండే మచ్చలన్నీ తొలగిపోవాలంటే.. వంటింట్లో దొరికే నెయ్యితో ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(23-12-2021)

చాలా మంది నెయ్యిని ఆహారంలో మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ  నెయ్యిని చర్మ సౌందర్య రక్షణకు ఉపయోగించటం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆ ప్రయోజనలేంటో చూద్దాం..


నెయ్యి మన చర్మ పొరలలోకి చొచ్చుకుపోతుంది. దీని వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. 

నెయ్యిలో ఏ, డీ, ఈ, కే విటమిన్లు ఉంటాయి. వీటి వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. 

నెయ్యిని క్రమం తప్పకుండా రాయటం వల్ల చర్మంపై ఉండే మచ్చలన్నీ తొలగిపోతాయి.  

పెదవులు ఎండిపోయి.. వాటిపైనున్న చర్మం పొట్టుగ్గా రాలిపోతున్నప్పుడు నెయ్యి రాయటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు నెయ్యి రాస్తే- ఉదయానికి మెత్తగా తయారవుతాయి. 

ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వాటర్‌ఫ్రూప్‌ మేక్‌పను వేసుకుంటున్నారు. సాధారణంగా ఈ మేక్‌పను తొలగించటం చాలా కష్టమైన పని. నెయ్యి ద్వారా ఈ మేకప్‌ను సులభంగా తొలగించవచ్చు. 

వంటింట్లో ఎక్కువగా పనిచేస్తే చేతివేళ్లు గరుగ్గా తయారవుతాయి. అలాంటి వేళ్లకు నెయ్యి రాయటం వల్ల అవి మృదువుగా మారతాయి. 

Advertisement
Advertisement