7.55శాతం వ్యాక్సిన్‌ డోసుల వృథా

ABN , First Publish Date - 2021-04-21T07:49:37+05:30 IST

తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ డోసులు వృథా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది...

7.55శాతం వ్యాక్సిన్‌ డోసుల వృథా

  • తమిళనాడులో 12 శాతం: కేంద్రం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):  తెలంగాణ సహా మరిన్ని రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ డోసులు వృథా అయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. అత్యధికంగా తమిళనాడులో 12శాతం వ్యాక్సిన్‌ డోసులు వృఽథా అయ్యాయని, హరియాణలో9.74, పంజాబ్‌లో 8.12, మణిపూర్‌లో7.8,  తెలంగాణలో 7.55శాతం వ్యాక్సిన్‌ డోసులు వృథా అయ్యాయని వివరించింది. ఈ నెల11 వరకు అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం10 కోట్ల డోసులను వాడితే, 44 లక్షల డోసులు వృథా అయ్యాయని పేర్కొంది. కేరళ, పశ్చిమ బెంగాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మిజొరాం, గోవా, డామన్‌ అండ్‌ డయ్యూ, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీ్‌పలలో వృథా తక్కువగా ఉందని, ఆయారాష్ట్రాల్లో జీరో వేస్టేజ్‌ ఉందని చెప్పింది. 

Updated Date - 2021-04-21T07:49:37+05:30 IST