ఎరువు..బరువు!

ABN , First Publish Date - 2021-04-12T04:58:21+05:30 IST

-సాగు వ్యయం పెరుగుతున్న తరుణంలో రసాయన ఎరువుల పెంపు నిర్ణయంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎరువుల ధర పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. 8వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించాయి. కనిష్టంగా రూ.150, గరిష్టంగా రూ.700 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడంతో అమలు నిర్ణఱయాన్ని వాయిదా వేశాయి. కొద్దిరోజుల్లో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఎరువు..బరువు!




రసాయన ఎరువుల ధరలు భారీగా పెంపు

డీఏపీ బస్తాపై రూ.700

ఇతర వాటిపై రూ.150 నుంచి రూ.450 పెరుగుదల

కొత్త రేట్లు ప్రకటించిన కంపెనీలు

కేంద్రం ఒత్తిడితో తాత్కాలికంగా వాయిదా

ఎన్నికలే కారణమంటున్న రైతు సంఘాల ప్రతినిధులు

(కలెక్టరేట్‌)

రైతులపై రసాయన ఎరువుల ధరల పెంపు కత్తి వేలాడుతుందా? కేంద్ర ప్రభుత్వ జోక్యంతో కంపెనీలు తాత్కాలికంగా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయా? ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత పెంచిన ధరలు అమలుచేయనున్నాయా? డీఏపీ బస్తాపై రూ.700, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులపై రూ.150 నుంచి రూ.450 వరకూ ధర పెరగనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రసాయన ఎరువుల తయారీకి వినియోగించే క్రూడాయిల్‌, నత్రజని, భాస్వరం, పొటాష్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగడమే కారణమని కంపెనీలు చెబుతున్నాయి .కేంద్రం కొత్తగా తెచ్చిన ’అగ్రి సెస్‌’తో ఎరువులపై 5ు అదనపు భారం పడింది. ఇవన్నీ ఎరువుల ధర అమాంతం పెరగడానికి కారణమవుతున్నాయి.  రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

-సాగు వ్యయం పెరుగుతున్న తరుణంలో రసాయన ఎరువుల పెంపు నిర్ణయంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఎరువుల ధర పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో కంపెనీలు కొత్త ధరలను ప్రకటించాయి. 8వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించాయి. కనిష్టంగా రూ.150, గరిష్టంగా రూ.700 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడంతో అమలు నిర్ణఱయాన్ని వాయిదా వేశాయి. కొద్దిరోజుల్లో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. 


50 శాతానికి పైగా పెంపు

ఎరువుల ధర పెంపుపై ప్రభుత్వాలు వింత ప్రచారానికి తెరతీస్తున్నాయి. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడానికి, సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగమే ఈ పెంపు నిర్ణయంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. డీఏపీ 50 కిలోల బస్తా ధర రూ.1275 ఉండగా... రూ.700 పెంచారు. దీంతో డీఏపీ ధర రూ.1975కు చేరుకోనుంది.  పాత ధరకు అదనంగా కాంప్లెక్స్‌ ఎరువులరకాన్ని బట్టి బస్తాకు రూ.200నుంచి రూ.500దాకా పెంచారు.  28-28-0 రకం పాతధర రూ.1350కాగా.. పెంచిన ధరతో రూ.1700కు చేరుకోనుంది, పొటాష్‌ పాతధర రూ.875కాగా..కొత్త ధర రూ.1,000కు,  20-20-0-13 రకం పాత ధర రూ.950కాగా.. రూ.1,400కు పెరిగింది. 12-32-16 రకం పాతధర రూ.1300కాగా.. కొత్త ధర రూ.1600కు చేరింది.  అయితే యూరియా ధరలపై స్పష్టత లేదు. డీఏపీ, కాంప్లెక్స్‌ ధరలు భారీగా పెంచడంతో వ్యవసాయానికి పెట్టుబడుల భారమవుతుందని రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


వాయిదా వెనుక రాజకీయం

ఎరువుల ధరలు పెంచినట్టు ప్రకటించిన కంపెనీలు నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాయి. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతంలో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు సాగు చట్టాలపై రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ సమయంలో ఎరువుల ధర పెరిగితే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశమున్నందున కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని కంపెనీలను ఆదేశించినట్టు తెలుస్తోంది. ముడిసరుకుల రేట్లు పెరిగాయన్న కారణంగా పలు కంపెనీలు ఒక్కసారిగా రసాయన ఎరువుల ధరలు అమాంతం పెంచడంపై రైతులు పెదవివిరుస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెంపు విషయంలో రైతుల విన్నపాలు పట్టించుకోని ప్రభుత్వం..ఎరువుల ధరల పెంచడానికి అనుమతివ్వడంపై రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. 



11111111111111111111111111111111111111111111111

Updated Date - 2021-04-12T04:58:21+05:30 IST