Abn logo
Oct 12 2021 @ 17:15PM

Viral video: బుల్లి ఏనుగుకు Z+++ సెక్యూరిటీ.. నెటిజన్ల రియాక్షన్ అదుర్స్..!

ఒక్కోసారి మనుషుల కంటే జంతువులే మేలని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది.. కన్న పిల్లలు అని కూడా చూడకుండా చంపడమే, అత్యాచారాలకు పాల్పడడమో చేస్తున్న రోజులివి. కానీ జంతువులు మాత్రం తమ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటాయి. ఎవరైనా వాటి జోలికొస్తే.. ప్రాణాలను పణంగా పెట్టి రక్షించుకుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ బుల్లి ఏనుగును కాపాడేందుకు మిగతా ఏనుగులు చేసిన పని చూస్తే.. వాటి ప్రేమ అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

రోడ్డుపై వెళ్తున్న గున్న ఏనుగు చుట్టూ.. పెద్ద పెద్ద ఏనుగులన్నీ రక్షణ వలయంగా మారతాయి. దాన్ని అనుసరిస్తూ వెంటే వెళ్తుండడాన్ని వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. గున్న ఏనుగుకు జడ్ ప్లస్ ఫ్లస్ కేటగిరీ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయింది.

ఈ వీడియోను చూసిన వారంతా వారి అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. ‘‘మనుషుల కంటే జంతువులే మేలు’’.. ‘‘ తల్లిదండ్రులంతా ఇలాగే పిల్లలతో కలిసి నడవాలి’ అంటూ కామెంట్ చేశారు. ‘‘ వీడియో చూడముచ్చటగా ఉంది’’.. అని ఒకరంటే, ‘‘బుల్లి ఏనుగుకు ఎంత పెద్ద సెక్యూరిటీ’’.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘‘ఏనుగులను చూసి అంతా నేర్చుకోవాలి’’.. ఈ ఏనుగులు చాలా సున్నితంగా ఉన్నట్టున్నాయ్.. అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...