మొక్కలతోనే మానవ మనుగడ

ABN , First Publish Date - 2021-06-20T05:13:20+05:30 IST

మొక్కలతోనే మానవ మనుగడ అని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. మున్సిపల్‌ పరిధిలో శనివారం పట్టణ ప్లాంటేషన్‌, ఫిట్టింగ్‌ పనులను శనివారం పరిశీలించారు. పట్టణంలోని ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌, కమిషనర్‌గంగాధర్‌, వైస్‌చైర్మన్‌ భగత్‌ పాల్గొన్నారు.

మొక్కలతోనే మానవ మనుగడ
భీమ్‌గల్‌లో ప్లాంటేషన్‌ పనులను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ లత

భీమ్‌గల్‌, జూన్‌19: మొక్కలతోనే మానవ మనుగడ అని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. మున్సిపల్‌ పరిధిలో శనివారం పట్టణ ప్లాంటేషన్‌, ఫిట్టింగ్‌ పనులను శనివారం పరిశీలించారు. పట్టణంలోని ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌, కమిషనర్‌గంగాధర్‌, వైస్‌చైర్మన్‌ భగత్‌ పాల్గొన్నారు.
గన్నారం గ్రామంలో గుంతల పరిశీలన
ఇందల్‌వాయి: గన్నారంలో మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలను అదనపు కలెక్టర్‌ లత పరిశీలించారు. మండలంలోని 44వ జాతీయ ర హదారి వెంబడి ఎక్కువ మొక్కలు నాటేవిధంగా చూడాలని తెలిపారు. ఎం పీడీవో రాములునాయక్‌, ఎంపీవో సుభాష్‌చంద్రభోస్‌, సిబ్బంది ఉన్నారు.
త్వరగా పెరిగే మొక్కలు నాటాలి
సిరికొండ: త్వరగా పెరిగే మొక్కలను నాటాలని డివిజనల్‌ పంచాయతీ అధికారి నాగరాజ్‌ తెలిపారు. రావుట్ల, చీమన్‌పల్లి గ్రామాల్లో శనివారం న ర్సరీలను, పల్లెప్రకృతి వనాలను పరిశీలించారు. అనంతరం పంచాయతీల రికార్డులను తనిఖీ చేశారు. నర్సరీలలో పెంచుతున్న మొక్కలు ఎత్తు ఎ క్కువగా పెరిగిన తర్వాత నే నాటాలని సూచించారు. చిన్న మొక్కలను నా టితే త్వరగా పెరిగే అవకాశం లేదన్నారు. ఇన్‌చార్జి లక్ష్మీప్రసాద్‌ తోటరాజ న్న, క్యాతం శివ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మిర్యాల్‌ గ్రామాన్ని సందర్శించిన అధికారులు
ఏర్గట్ల: గుమ్మిర్యాల్‌ గ్రామాన్ని శనివారం జిల్లా విజులెన్స్‌ అధికారి నారా యణ ఆకస్మికంగా సందర్శించారు. పంచాయతీ ఆధ్వర్యంలోని పల్లెప్రగతి ప నులు, ప్రకృతివనం, నర్సిరీతో పాటు పారిశుధ్య పనులను పరిశీలించి సంతృ ప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో కర్నె రాజేషం ఉన్నారు.
మొక్కలు నాటే పనిలో నిమగ్నం
డిచ్‌పల్లి: కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిచ్‌పల్లి డివైడర్‌ మధ్యలో మొక్కలు నాటే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. 44వ జాతీయ రహదారి నుంచి డి చ్‌పల్లి రైల్వేస్టేషన్‌ వరకు మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పల్లెప్రకృతి వనాల కోసం స్థలం గుర్తింపు
ధర్పల్లి: పల్లెప్రకృతి వనాల కోసం శనివారం తహసీల్దార్‌ వసంత్‌రెడ్డి స్థ లాలను పరిశీలించారు. త్వరలోనే ఈ గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రవి, సర్వేయర్‌ పాల్గొన్నారు.
రెండురోజుల్లో పూర్తి చేయాలి
ముప్కాల్‌: 44వ జాతీయరహదారి పక్కన మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వకం పనులు రెండురోజుల్లో పూర్తి చేయాలని ఎంపీడీవో దా మోదర్‌ సూచించారు. మండలంలో అవెన్యూ ప్లాంటేషన్‌ పనులను ప రిశీ లించారు. వేంపల్లి, కొత్తపల్లి, ముప్కాల్‌, నల్లూర్‌ గ్రామాల పరిధిలో గల 44వ జాతీయరహదారికి ఇరువైపులా హరితహరంలో భాగంగా గుంతలు తవ్వకం పనులు కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీలు శంకర్‌, భరత్‌, విజయ్‌, రాజ్యలక్ష్మీ, ఎంపీవో భరత్‌ పాల్గొన్నారు.
కొనసాగుతున్న పనులు
వేల్పూర్‌: పలు గ్రామాలలో హరితహరంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రధానరోడ్లకు ఇరువైపులా పిచ్చిమొ క్కలను తొలగించి కూలీలతో నాటిస్తున్నారు.

Updated Date - 2021-06-20T05:13:20+05:30 IST