ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..

ABN , First Publish Date - 2022-01-22T00:01:34+05:30 IST

కొన్నిసార్లు భార్యను భర్త, లేక భర్తను భార్యే చంపిచడం కూడా జరుగుతుంటుంది. అయితే జార్ఖండ్‌లో మాత్రం సినిమా సీన్‌ను తలదన్నే ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో వెళ్లాలనుకున్న భార్య నిర్ణయాన్ని భర్త స్వాగతించాడు. అయితే చిరవగా ఒక కండీషన్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే..

ప్రియుడితోనే వెళ్లు..! భార్యను సాగనంపిన భర్త.. చివరగా ఒకే ఒక్క కండీషన్ పెట్టాడు..

వివాహం జరిగిన తర్వాత వివిధ కారణాలతో దంపతుల మధ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కట్నం, వివాహేతర సంబంధం, పెళ్లికి ముందున్న ప్రేమ వ్యవహారాలను పెళ్లి తర్వాత కూడా కొనసాగించడం.. తదితర కారణాలతో విభేదాలు తలెత్తుతుంటాయి. ఇలాంటి సమయాల్లో పెద్దలు కలుగజేసుకుని పంచాయితీలు చేయడం చూస్తుంటాం. కొన్నిసార్లు భార్యను భర్త, లేక భర్తను భార్యే చంపించడం కూడా జరుగుతుంటుంది. అయితే జార్ఖండ్‌లో మాత్రం సినిమా సీన్‌ను తలదన్నే ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో వెళ్లాలనుకున్న భార్య నిర్ణయాన్ని భర్త స్వాగతించాడు. అయితే చిరవగా ఒక కండీషన్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే..


జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ జిల్లా కడఘోడ అనే గ్రామానికి చెందిన సంజయ్ మహ, నమిత మహ దంపతులు. వీరికి 2016లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. నమితకు కుటుంబ బాధ్యతల కంటే స్మార్ట్ ఫోన్‌‌లో గడపడం అంటేనే ఎక్కువ ఆసక్తి. రోజులో ఎక్కువ శాతం సోషల్ మీడియాలోనే గడుపుతూ ఉంటుంది. భర్త పలుమార్లు మందలించినా ఆమె తీరు మాత్రం మార్చుకోలేదు. ఈ క్రమంలో నమితకు ఫేస్‌బుక్‌లో ముంబైకి చెందిన శుక్ర అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఫేస్‌బుక్ చాటింగ్ కాస్త.. కొన్నాళ్లకు వాట్సప్ చాటింగ్ వరకూ వెళ్లింది. అంతటితో ఆగకుండా రోజూ పోన్లు చేసుకుని, వ్యక్తిగత విషయాలు షేర్ చేసుకునే వరకూ వెళ్లారు. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.

వామ్మో.. వీళ్లు మామూలోళ్లు కాదు.. భార్య పక్కా స్కెచ్.. ఆ తర్వాతే భర్త ఎంట్రీ.. ట్రాప్‌లో పడితే అంతే సంగతులు..!


ఓ రోజు ‘‘ చూడాలని వుంది.. అర్జెంట్‌గా మా ఊరికి వచ్చేయ్’’.. అని నమిత బలవంతం చేయడంతో ముంబై నుంచి ప్రియుడు వచ్చేశాడు. తర్వాత ఏం మాట్లాడుకున్నారో ఏమోగానీ.. ఇద్దరూ కలిసి ఊరు వదిలి వెళ్లిపోయారు. చివరగా పోలీసుల జోక్యంతో నమిత, ఆమె ప్రియుడు మళ్లీ గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు, కొందరు పెద్ద మనుషుల మధ్య పంచాయితీ జరిగింది. ఎంత నచ్చజెప్పాలని చూసినా.. తాను ప్రియుడితో పాటే వెళ్లిపోతానని నమిత చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు నమిత భర్త కూడా అందుకు అంగీకరించాడు. అయితే పిల్లలను కూడా తీసుకెళ్తానంటేనే వెళ్లు అని కండీషన్ పెట్టాడు. అందుకు నమిత, ఆమె ప్రియుడు అంగీకరించడంతో సమస్య సర్దుమణిగింది. అయితే ఈ ఉదంతం మాత్రం స్థానికంగా సంచలనం కలిగించింది.

ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..

Updated Date - 2022-01-22T00:01:34+05:30 IST