HYD : భార్యను చితకబాదిన భర్త.. ఆ బంగ్లాలో నాలుగుసార్లు బ్రోతల్ కేసుల్లో...!
ABN , First Publish Date - 2021-07-23T16:37:22+05:30 IST
కాగా, ఇదే బంగ్లాలో మూడు, నాలుగుసార్లు బ్రోతల్ కేసుల్లో...
- భార్యను తీవ్రంగా కొట్టిన భర్త
- ఆ బంగ్లాపై స్థానిక మహిళల ఆందోళన
హైదరాబాద్ సిటీ/బోయిన్‌పల్లి : తాగిన మత్తులో భర్త భార్యను చితకబాదడంతో ఆమె తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. బోయిన్‌పల్లి సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్ దేశం ఆను జిల్లా అదిరిటంజన్ గ్రామానికి చెందిన జునాసునూర్ పది సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కొన్ని రోజులుగా న్యూబోయిన్‌పల్లి సీతారాంపురంలోని సీఎంఆర్ పాఠశాల ముందు ఉన్న యాదవ్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ పాచిపని చేసుకుంటూ జీవనం సాగిస్తుంది.
కాగా జునాసునూర్ తమ్ముడి స్నేహితుడు అర్జువాతాసా కొంపల్లిలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేసుకుంటూ భార్య సబీనాదాపాతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఒకే దేశం కావడంతో అర్జువాతాపా కుటుంబం తరచూ జునాసునూర్ ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఇంటి యజమాని ఒత్తిడి కారణంగా అర్జునాతాపా తన భార్యతో కలిసి మంగళవారం ఇంటిని ఖాళీచేసి జునాసునూర్ ఇంటికి వచ్చి కొద్దిరోజులపాటు ఇక్కడే ఉంటామని చెప్పాడు. అందుకు జునాసునూర్ అంగీకరించింది. ఈ నెల 21న రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో వచ్చిన అర్జున్ సబీనాను చితకబాదాడు.
ఈ ఘటనలో సబీనాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన జునాసునూర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇదే బంగ్లాలో మూడు, నాలుగుసార్లు బ్రోతల్ కేసుల్లో పలువురు యువతీ యువకులు, మహిళలు పట్టుబడ్డారు. పోలీసులు ఈ బంగ్లా యజమానిపైన చర్యలు తీసుకోవాలని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు.