ధౌల్‌పూర్: రాజస్థాన్‌లోని ధౌల్‌పూర్‌లో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎన్నాళ్లయనా భార్య పుట్టింటి నుంచి రావడంలేదని కలతకులోనైన భర్త 50 అడుగుల ఎత్తయిన రావి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఈ విషయం స్థానికంగా అందరికీ తెలియడంతో వారంతా చెట్టు దగ్గరకు చేరుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి వచ్చి, ఆ వ్యక్తిని కిందకు దిగాలని కోరడంతో అతను కిందకు దిగివచ్చాడు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ యువకుని భార్య పుట్టింటికి వెళ్లి రెండేళ్లు గడచినా తిరిగి రాలేదు. ఈ కాలంలో అతను భార్యను తీసుకువచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమెను బెదిరించేందుకు చెట్టెక్కి కూర్చున్నాడు.