Abn logo
Aug 3 2020 @ 11:49AM

భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య

బీర్కూర్‌(నిజామాబాద్): భార్య మందలించడంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బీర్కూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఇస్తారాకుల భూమ య్య (40) కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. శనివారం సాయంత్రం కూడా రావడంతో భార్య సావిత్రి ఆగ్రహంతో రోజూ మద్యం ఎందుకు తాగుతున్నావని మందలిం చింది.


దీంతో భూమయ్య మనస్థాపానికి గురై శని వారం సాయంత్రం బీర్కూర్‌ శివారులోని బాజన్‌ చెరువు కట్ట వద్ద పురుగుల మందు తా గాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే భూమయ్యను బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సూచనల మేరకు నిజామాబాద్‌ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై సతీష్‌ వర్మ తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Advertisement
Advertisement