Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూరగాయలకు వెళ్లిన భర్త.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయని భార్య.. పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి వెళ్లిచూడమని చెప్తే..

వారిద్దరూ అన్యోన్య దంపతులు. ఉన్నంతలో సర్దుకుంటూ ఆనందంగా జీవితం గడిపేవారు. అయితే ఒక్కసారిగా వారి ఇంట్లో అనుకోని ఘటన జరిగింది. ఓ రోజు భర్త కూరగాయలకు వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అనుమానం వచ్చి, భార్యతో మాట్లాడాలని ఇంటికి ఫోన్ చేశాడు. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా భార్య లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారుపడి పక్కింటి కుర్రాడికి ఫోన్ చేస్తే.. ఊహించని వార్త తెలిసింది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడు విరుధునగర్ జిల్లా రాజపాళయంలోని దురైస్వామిపురం వీధిలో గణేశన్, ఇంద్రాణి దంపతులు. వీరికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కిరాణా దుకాణం నడుపుకొంటూ జీవిస్తుంటారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ.. ఆదర్శ దంపతుల్లా పేరు తెచ్చుకున్నారు. భర్త బయటి వెళ్లే సమయంలో ఇంద్రాణి దుకాణం చూసుకుంటూ ఉండేది. రోజూ మాదిరే అంగడి సరుకులు తీసుకొచ్చేందుకు భర్త బయటికి వెళ్లాడు. దీంతో ఇంద్రాణి ఒక్కటే షాపులో ఉంది. అయితే బయటికి వెళ్లిన భర్తకు ఏదో సందేహం వచ్చి భార్యకు ఫోన్ చేశాడు. అయితే ఎన్నిసార్లు చేసినా.. భార్య లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి, వెళ్లి చూడమన్నాడు. అక్కడికి వెళ్లిన ఆ వ్యక్తి అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు.

రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న ఇంద్రాణిని చూసి షాక్ అయ్యి.. ఆమె భర్తకు విషయం తెలియజేశాడు. దీంతో ఉరుకుపరుగున ఇంటికి చేరుకున్న భర్త.. ఇంద్రాణిని ఆ స్థితిలో చూసి బోరున విలపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. జరిగిన ఘటనపై చుట్టుపక్కల వారిని విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తి షాపు లోపలికి చొరబడి, గొంతు కోసి పరారైనట్లుగా తెలిసింది. తెలిసిన వారే హత్య చేశారా.. లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాధచాయలు అలుముకున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement