వీడసలు భర్తేనా.. పెళ్లయి 13 ఏళ్లు అవుతున్నా ఇదేం పాడు బుద్ధి.. స్నేహితులను ఇంటికి పిలిచి మరీ..

ABN , First Publish Date - 2022-05-18T18:42:37+05:30 IST

ఆమెకు వివాహం జరిగి 13 ఏళ్లు అవుతోంది.. 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. అయినా భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు..

వీడసలు భర్తేనా.. పెళ్లయి 13 ఏళ్లు అవుతున్నా ఇదేం పాడు బుద్ధి.. స్నేహితులను ఇంటికి పిలిచి మరీ..

ఆమెకు వివాహం జరిగి 13 ఏళ్లు అవుతోంది.. 12 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. అయినా భర్త ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు.. ఎన్నోసార్లు తన ఇద్దరు స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఇన్నేళ్లూ భర్త ఆగడాలను భరించిన భార్య చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.. పోలీసులు బాధిత మహిళ భర్తపై, అతని ఇద్దరి స్నేహితులపై కేసులు నమోదు చేశారు. బీహార్‌లోని నలంద ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

ఇది కూడా చదవండి..

పిల్లలు పుట్టడం లేదని రెండో పెళ్లి చేసుకున్న భర్త.. మొదటి భార్య కోపానికి నలుగురి ప్రాణాలు బలి..!




నలంద ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. బాధితురాలి భర్త కార్మిక శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఆ మహిళకు 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. పాట్నాకు చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి భర్త కొన్ని నెలలుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధిత మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితులతో కలిసి భర్త తనపై గతంలో పలుసార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. 


అడ్డు చెబితే బాధిత మహిళను నిందితుడు కొట్టి హింసించేవాడు. ఇటీవలి కాలంలో అతడి ప్రవర్తన శ్రుతి మించడంతో జరిగిన విషయాన్ని బాధిత మహిళ తన తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబసభ్యుల సహకారంతో మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ భర్తతో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2022-05-18T18:42:37+05:30 IST