America లో భర్తకు జాబ్.. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆ భార్య అనుమానంతో ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-05-27T00:58:14+05:30 IST

వారిద్దరికీ 20ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య చదువుతూ ఉండగానే భర్తకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. చదువు పూర్తిచేయగానే అమెరికా తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. తన చదువు...

America లో భర్తకు జాబ్.. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆ భార్య అనుమానంతో ఆరా తీస్తే..
ప్రతీకాత్మక చిత్రం

వారిద్దరికీ 20ఏళ్ల క్రితం వివాహమైంది. భార్య చదువుతూ ఉండగానే భర్తకు అమెరికాలో ఉద్యోగం వచ్చింది. చదువు పూర్తిచేయగానే అమెరికా తీసుకెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. తన చదువు కొనసాగాలని భర్త నిర్ణయం తీసుకున్నందుకు.. ఆమె ఎంతో సంతోషించింది. అయితే చదువు పూర్తయినా భార్యను మాత్రం తీసుకెళ్లలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ తీసుకెళ్లకపోవడంతో అనుమానంతో ఆరాతీయగా.. సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..


రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌ పరిధి మండోర్‌లో ఉంటున్న కుశలకు ఉదయరామ్ అనే వ్యక్తితో 2002 ఫిబ్రవరిలో వివాహమైంది. అప్పటికి కుశల వయస్సు 12ఏళ్లు మాత్రమే ఉండడంతో రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో ఉదయరామ్ సోదరిని కుశల సోదరుడికి ఇచ్చి వివాహం చేశారు. అనంతరం ఉదయరామ్‌..2005లో హైదరాబాద్‌‌లో జాబ్‌లో జాయిన్ అయ్యాడు. కుశల కూడా అక్కడే పదో తరగతి పూర్తి చేసింది. అయితే అదే సంవత్సరం ఉదయరామ్‌.. ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అయితే చదువులు పూర్తయ్యాక తీసుకెళ్తా అని చెప్పి.. కుశలను వారి పుట్టింటికి పంపించాడు. కుశల 2010లో బీకామ్, 2013లో ఎంబీఏ కూడా పూర్తి చేసింది. అనంతరం ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. తనను అమెరికా తీసుకెళ్లాలని భర్తను ఎన్నిసార్లు అడిగినా.. వీసా సమస్య ఉందంటూ చెప్పుకొచ్చాడు.

ఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్..


ఈ క్రమంలో కుశల లా చదువు కూడా పూర్తి చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఏదో ఒక సాకు చెబుతూ భార్యను మాత్రం అమెరికా తీసుకెళ్లలేదు. దీంతో కుశలకు అనుమానం వచ్చి ఆరాతీయగా... ఉదయరామ్ అమెరికాలో వేరే యువతిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఉదయరామ్ అమ్మమ్మ చనిపోవడంతో సొంతూరికి వచ్చాడు. విషయం తెలుసుకున్న కుశల.. అక్కడికి వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. అమెరికా తీసుకెళ్లేందుకు ఉదయరామ్ ఒప్పుకోకపోవడంతో పాటూ వేరే వివాహం చేసుకోవడాన్ని.. కుశల జీర్ణించుకోలేకపోయింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఢిల్లీ విమానాశ్రయంలో అమెరికా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఉదయరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

రైల్వే ట్రాక్ పక్కన మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఓ మహిళ శరీర భాగాలు.. ఒకే ఒక్క క్లూతో 14 గంటల్లోనే వీడిన మిస్టరీ..!

Updated Date - 2022-05-27T00:58:14+05:30 IST