కట్టుకున్న భార్యే కడతేర్చింది!

ABN , First Publish Date - 2021-05-15T06:45:54+05:30 IST

కట్టుకున్న భార్యే అతడిని కడతేర్చింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై తల్లితో కలిసి దాడి చేసి హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కేసును త ప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన మండలంలోని ధేనువకొండలో శుక్రవారం వెలుగు చూ సింది.

కట్టుకున్న భార్యే కడతేర్చింది!
వల్లెపు సుబ్బారావు మృతదేహాన్ని పరిశీలిస్తున్న దర్శి డీఎస్పీ ప్రకాశరావు

తల్లి సహకారంతో భర్తను హత్య చేసిన వైనం

కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం 

ధేనువకొండలో ఘటన 


అద్దంకి, మే 14 : కట్టుకున్న భార్యే అతడిని కడతేర్చింది. మద్యం మత్తులో ఉన్న భర్తపై తల్లితో కలిసి దాడి చేసి హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కేసును త ప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటన మండలంలోని ధేనువకొండలో శుక్రవారం వెలుగు చూ సింది. పోలీసుల కథనం ప్రకారం..  ధేనువకొండకు చెం దిన వల్లెపు సుబ్బారావు(40)కు చీమకుర్తికి చెందిన సు భాషిణితో సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహమైం ది. వీరికి 15 సంవత్సరాల కుమార్తె, 13 సంవత్సరాల కు మారుడు ఉన్నారు. భార్యాపిల్లలు ధేనువకొండలో ఉం టుండగా సుబ్బారావు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ నెల 11న ఆయన హైదరాబాద్‌ నుంచి ధేనువకొండకు వచ్చాడు. సుబ్బారావుకు మద్యం అలవా టు ఉండటంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సుబ్బారావు తన తల్లి వద్దకు వెళ్లి భార్య,అత్తలు దుర్భాషలాడుతున్నారని చెప్పాడు. ఆ సమయంలో  మద్యం మత్తులో ఉన్న అత నికి ఆమె సర్దిచెప్పి పంపింది.  శుక్రవారం వేకువజాము న సుబ్బారావు పలకటం లేదని భార్య సుభాషిణి ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో సుబ్బారావు తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు అంకయ్యలు వెళ్లి చూడగా అతని తల, శరీ రంపై గాయాలు ఉన్నాయి. ముక్కుల నుంచి రక్తం కారు తోంది. ఈ విషయమై భార్య, అత్తలను ప్రశ్నించగా స రైన సమాధానం చెప్పలేదు. వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ సుబ్బారావు సోదరుడు అంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


పక్కా ప్రణాళికతో హత్య


పక్కా ప్రణాళికతోనే సుబ్బారావును హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సుభాషిణి తల్లి వేముల రమ ణమ్మ గురువారం చీమకుర్తి నుంచి  ధేనువకొండకు వ చ్చింది.  అర్ధరాత్రి దాటిన తరువాత సుబ్బారావుపై భా ర్య, అత్త దాడి చేసి హత్య చేసి ఉంటారని అనుమాని స్తున్నారు.  అయితే వీళ్లిద్దరే ఈ పని చేశారా? ఎవరి పా త్ర అయినా ఉందా? అన్న విషయంపై కూడా వారు దృష్టి సారించారు. సుబ్బారావు తలతోపాటు  చేతులు, మర్మాంగాలపై కూడా గాయాలు ఉన్నాయి. ఆయన్ను హత్య చేసిన తర్వాత తల్లీకూతుళ్లు కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారు. సుబ్బారావు తాగి వచ్చి గొడవ చేస్తున్నాడని కుటుంబ సభ్యుల్లో ఒకరితో పారా పోలీసుకు ఫోన్‌ చేసిన సమాచారం ఇప్పించారు. విష యం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పో లీసులకు ఎవరో వచ్చి చంపి వెళ్లారని చెప్పారు. ఇది అ నుమానాన్ని మరింత పెంచింది. భార్య, అత్తలే ఆయన్ను హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అం చనాకు వచ్చారు. కాగా సంఘటనా స్థలాన్ని దర్శి డీస్పీ ప్రకాశరావు, సీఐ ఆంజనేయరెడ్డి, ఎస్సై మహేష్‌ పరి శీలించారు.


Updated Date - 2021-05-15T06:45:54+05:30 IST