హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం

ABN , First Publish Date - 2021-05-05T16:52:38+05:30 IST

నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకం మరోసారి బయటడింది. వైద్యుల నిర్లక్ష్యంతో కోవిడ్ బాధితుడు మృతి చెందాడు.

హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం

హైదరాబాద్: నగరంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాకం మరోసారి బయటడింది. వైద్యుల నిర్లక్ష్యంతో కోవిడ్ బాధితుడు మృతి చెందాడు. కోవిడ్ బారిన పడిన శంకర్ పవన్ అనే వ్యక్తి ఏప్రిల్ 19న చికిత్స నిమిత్తం అర్చన ఆసుపత్రిలో చేరాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏప్రిల్ 26న వైద్యులు ఐసీయూకి షిఫ్ట్ చేశారు. కాగా ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో గత రాత్రి శంకర్ మృతి చెందాడు. ఐసీయూలో పేషెంట్‌ను పట్టించుకోకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రాణం పోతుందని బతిమాలినా కనికరించిన సిబ్బంది...చివరకు ప్రాణం పోయిన తర్వాత బతికించేందుకు యత్నించారు. రూ.10 లక్షలు కట్టించుకుని బాధితుడు చనిపోయినట్లు తెలిపారు. ఇందేంటని కుటుంబసభ్యులు ప్రశ్నించగా...కావాలని చేయలేదంటూ బుకాయించుకునే ప్రయత్నిం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-05-05T16:52:38+05:30 IST