Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాబోయే 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు: నాగరత్నం

హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు నేడు ఆగమనం అవుతాయని హైదరాబాద్ వాతావరణ అధికారి నాగరత్నం నాయుడు అన్నారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని తెలిపారు. జూన్ రెండో వారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకుతాయన్నారు. సాధారణ పరిస్థితులు ఈసారి ఉంటాయని... ఒకటి రెండు సార్లు అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశాలు ఉంటాయని చెప్పారు. సమృద్ధిగా వర్షాలు పడతాయని తెలిపారు. గతేడాదిలా ఈసారి విపత్కర పరిస్థితులు ఉండకపోవచ్చన్నారు. రాబోయే 24 గంటలు తెలంగాణలో ఓ మోస్తరు భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు.  అల్పపీడన ద్రోణి ప్రభావం మరో రెండు రోజులు ఉంటుందని నాగరత్నం నాయుడు పేర్కొన్నారు.

Advertisement
Advertisement