Abn logo
Oct 25 2021 @ 08:30AM

హైదరాబాద్‌ను గులాబీ ఫ్లెక్సీలతో నింపటాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ

హైదరాబాద్: నగరంలో గులాబీ ఫ్లెక్సీలతో నింపటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఈరోజు ఉదయం 10.30 గంటలకు బీఆర్కే భవన్ వద్ద సిటీ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జనవరి ఒకటి నుంచి నగరరంలో ఫ్లెక్సీలు, కటౌట్లు నిషేధమన్న మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయ నేతలు తమ ముఖాలు చూసుకోవడానికి మాత్రమే ఫ్లెక్సీలు పనికొస్తాయని కేటీఆర్ గత వ్యాఖ్యలను కమలనాథులు గుర్తుచేస్తున్నారు.  ఇప్పుడు తన ముఖాన్ని చూసుకోవటానికే ఫ్లెక్సీలను కేటీఆర్ ఏర్పాటు చేయించుకున్నాడా? అని బీజేపీ కార్పోరేటర్లు ప్రశ్నిస్తోన్నారు. టీఆర్ఎస్ పార్టీకి కాదు... ఇతర పార్టీలకు కోసమే నిబంధనలా?  అని నిలదీశారు. వివిధ విగ్రహాలకు కూడా టీఆర్ఎస్ తోరణాలను కట్టడాన్ని బీజేపీ ఆక్షేపిస్తోంది. బీఆర్కే భవన్ వద్ద ధర్నాలో బీజేపీ నేతలు, కార్పోరేటర్లు పాల్గొననున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...