Advertisement
Advertisement
Abn logo
Advertisement

టీఆర్ఎస్‌పై ధర్నా చౌక్ పరిరక్షణ సమితి నేతల విమర్శలు

హైదరాబాద్: ధర్నా చౌక్‌ను ఎత్తేసిన టీఆర్ఎస్.. అక్కడే ధర్నా చేయడానికి సిగ్గుండాలని పరిరక్షణ సమితి నాయకులు విమర్శించారు. ప్రజల ఇబ్బందులు గులాబీ పార్టీకి గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇకమీదట ప్రతిపక్షాల ఆందోళనకు కూడా అవాంతరాలు లేకుండా అనుమతి ఇవ్వాలన్నారు.


తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో టీఆర్ఎస్ నేతలు మహాదర్నా చేపట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇక్కడ ఆందోళనలు చేసే అవకాశం ఉండేది.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ను ఎత్తివేసింది. ఈ సందర్భంగా ధర్నా చౌక్ పరిరక్షణ సమితి నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆనాడు ధర్నా చౌక్ వల్ల ప్రజలకు ఇబ్బందులని చెప్పి ఎత్తేశారని, ఇవాళ టీఆర్ఎస్ ఇక్కడ ధర్నా చేస్తోందని, మరి ప్రజలకు ఇబ్బంది కలగదా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ఇది అంతమని అన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎవరూ ధర్నా చేయాల్సిన అవసరం ఉండదని కేసీఆర్ అన్నారని, ఇప్పుడు ఆ పార్టే ధర్నా చేస్తోందని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement