Abn logo
May 14 2021 @ 10:13AM

పాతబస్తీలో మొదలైన లాక్‌డౌన్

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో లాక్‌డౌన్ మొదలైంది. చార్మినార్ ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. షాపులన్నింటినీ పోలీసులు మూసివేశారు. దీంతో రంజాన్ పండుగ సందర్భంగా పాతబస్తీలో కళ తప్పింది. మక్కా మజీద్‌లో ప్రార్థనలను పోలీసులు నిషేధించారు. ఎవ్వరు బయటకు రావొద్దని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. 

Advertisement