HYD : ఈ BIKE పై ఉన్న చలానాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు!

ABN , First Publish Date - 2021-09-30T16:53:00+05:30 IST

వాహన తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఉన్న చలాన్లను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు...

HYD : ఈ BIKE పై ఉన్న చలానాలు చూసి పోలీసులే అవాక్కయ్యారు!

  • ద్విచక్ర వాహనంపై 88 చలాన్లు
  • రూ. 28,110 జరిమానా

హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్‌: వాహన తనిఖీల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ఉన్న చలాన్లను పరిశీలించిన పోలీసులు అవాక్కయ్యారు. ఏకంగా 88 చలాన్లు ఉండడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సుల్తాన్‌ బజార్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రసాద్‌, ఏఎస్ఐ గోపాల్‌లు సిబ్బందితో అఫ్జల్‌గంజ్‌ రోటరీ వద్ద బుధవారం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా వచ్చిన ద్విచక్ర వాహనం(టీఎస్‌ 11 ఈఎల్‌ 5838) ఆపి చలాన్లను పరిశీలించారు. దానిపై ఏకంగా 88 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించినందుకు రూ.28,110 ఫైన్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుల్తాన్‌బజార్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుమన్‌ కుమార్‌ మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.

Updated Date - 2021-09-30T16:53:00+05:30 IST