Abn logo
Jun 15 2021 @ 11:58AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు భారీగా బీజేపీ కార్యకర్తలు...అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీ నుంచి నగరానికి వస్తున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు, ఈటల అభిమానులు చేరుకున్నారు. కాగా బీజేపీ కార్యకర్తలను పోలీసుల అడ్డుకోవడంతో వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌ వస్తోన్న ఈటలకు ఘనస్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా ఎయిర్‌పోర్ట్‌లోకి బీజేపీ కార్యకర్తలను అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో అన్ని వైపులా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు.  నేతలు, కార్యకర్తలను చెక్ పోస్టుల వద్దే పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.