Abn logo
Oct 23 2021 @ 12:02PM

HYD: చెత్తకుండీలో శిశువు మృతదేహం లభ్యం

హైదరాబాద్: నగరంలోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ చెత్తకుండీలో శిశువు మృతదేహం లభ్యమైంది. అంబర్‌పేట్‌లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెత్త కుప్పలో పడేశారు. జీహెచ్ఎంసీ కార్మికులు చెత్తకుప్పలోని చెత్తను తొలగిస్తుండగా శిశువున గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శిశువు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...