హత్య కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-02-23T07:10:52+05:30 IST

ఇంట్లో అద్దెకుంటూ ఇంటి యజమానురాలిని హత్య చేసిన నింది తులను నగర ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ నేతృత్వంలో రెండో టౌన్‌ ఎస్సై ఆంజనేయు లు, సిబ్బంది కేసును

హత్య కేసును చేధించిన పోలీసులు

ఖిల్లా, ఫిబ్రవరి 22: ఇంట్లో అద్దెకుంటూ ఇంటి యజమానురాలిని హత్య చేసిన నింది తులను నగర ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ నేతృత్వంలో రెండో టౌన్‌  ఎస్సై ఆంజనేయు లు, సిబ్బంది కేసును చేధించినట్లు నిజామా బాద్‌ ఏసీపీ జి.శ్రీనివాస్‌కుమార్‌ తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో వివరాలను విలే రులకు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కస్బాగ ల్లీకి చెందిన జాగిర్దార్‌ ప్రభావతిబాయి ఇంట్లో భిక్కనూరుకు చెందిన షేక్‌ షకీల్‌, మౌనికలు భార్యాభర్తలుగా నమ్మించి అద్దెకుంటున్నారు. ప్రభావతిబాయి మెడలో గల బంగారు ఆభర ణాలపై కన్నేసిన వారు వారి పాత స్నేహి తులైన షేక్‌ సిరాజ్‌, స్వప్నలను పిలిపించి వాటిని ఎలాగైనా దొంగిలించాలని పథకం పన్నారు. పథకం ప్రకారం ఈనెల 17న రాత్రి  టీవీ చూడాలనే నెపంతో యజమానురాలి ఇంట్లో కూర్చుని వారు వేసుకున్న పథకం ప్రకారం ఆమెను గొంతు నులిమి హత్య చేశా రు. మృతదేహాన్ని ఎవరికి అనుమానం రాకు ండా దుప్పట్లో చుట్టి ఆటోలో తీసుకొని వర్ని రోడ్‌లో గల కొత్తపేట్‌ శివారులో ప్రవహిస్తు న్న నిజాంసాగర్‌ కెనాల్‌లో పడవేశారు.


తన తల్లి మూడు రోజులుగా కనిపించడం లేదని మృతురాలి కొడుకు  దీపక్‌రావు ఈనెల 20న రెండో టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్న పోలీసులు మృతురాలి ఇంట్లో అద్దెకుంటున్న వారు సైతం కనిపించకపోవడ ంతో వారి ఆచూకీ కోసం గాలించి పట్టుకున్నా రు. వారిని విచారించగా వారు నేరం ఒప్పు కున్నారు. మృతురాలి మెడలో నుంచి దొంగి లించిన బంగారు ఆభరణాలతో పాటు రూ.21 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన వివరించారు. ఈ కేసును చేధించిన నగర  ఇన్‌స్పెక్టర్‌ సత్యనా రాయణ, రెండో టౌన్‌ ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది కిషోర్‌, అప్సర్‌, సుభాష్‌, హరికృష్ణ, ఇంద్రసేనారెడ్డిలను ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌, సీపీ కార్తికేయలు అభినందించారు.  

Updated Date - 2020-02-23T07:10:52+05:30 IST