Abn logo
Feb 24 2021 @ 23:16PM

రాజీపడదగిన కేసులు గుర్తించండి


కోటబొమ్మాళి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈనెల 27న నిర్వ హించనున్న వర్చువల్‌ లోక్‌ అదాలత్‌తో రాజీపడదగ్గ కేసులను గుర్తిం చాలని జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రకాష్‌ బాబు అన్నారు. బుధవారం కోర్టులో బ్లూజీన్స్‌ యాప్‌ ద్వారా ఇచ్చాపురం, సోంపేట, సారవకోట, పాతపట్నం, వజ్ర పుకొత్తూరు, పలాస, మెళియాపుట్టి, నందిగాం, టెక్కలి, నౌపడ, జలుమూరు, సంత బొమ్మాళి, కోటబొమ్మాళి పోలీసు అధికారులు, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయవాదులు, కక్షిదారులు, పోలీసు లు, ఎక్జైజ్‌ అధికారులు ఈ వర్చువల్‌ లోక్‌అదాలత్‌లో పెద్ద సంఖ్యలో సివిల్‌, క్రిమినల్‌, పెండింగ్‌ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించాలని కోరారు.

 

Advertisement
Advertisement
Advertisement