కళాశాలలు ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2022-03-23T04:59:01+05:30 IST

మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల ను ఏర్పాటు చేయకపోతే బీజే వైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధా కర్‌రావు హెచ్చరించారు.

కళాశాలలు ఏర్పాటు చేయకపోతే ఉద్యమిస్తాం
బీజేవైఎం నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేయిస్తున్న ఎల్లేని సుధాకర్‌రావు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు 


పెద్దకొత్తపల్లి, మార్చి 22: మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల ను ఏర్పాటు చేయకపోతే బీజే వైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తు న ఉద్యమిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధా కర్‌రావు హెచ్చరించారు. మం గళవారం పెద్దకొత్తపల్లి బ స్టాండ్‌ చౌరస్తాలో బీజేవైఎం మండల శాఖ ఆధ్వ ర్యంలో చేపట్టిన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండల కేంద్రా నికి జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాలలు వస్తా యోమోనని ఎదురుచూస్తున్న విద్యార్థుల ఆశ యాలపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పదో తరగతి పూర్తయిన వెంటనే ప్రైవేట్‌ కళాశాలల్లో చదివించే ఆర్థిక స్థోమత లేనందున వారి చదువు ను మధ్యలోనే ఆపివేయడం బాధాకరమన్నారు. 20సంవత్సరాలుగా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల లేకపోవడం గత పాలకుల పనితీరుకు నిర్లక్ష్యమని ప్రభు త్వాన్ని విమర్శించారు. పెద్దకొత్తపల్లిలో ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్ర మాలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల శివుడు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూలే భరత్‌, బీజేవైఎం రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ అభిలాష్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇన్‌చార్జి చిత్తరంజన్‌రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు పదిరె భీమేష్‌, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కడ్తాల కృష్ణయ్య, జిల్లా కార్యదర్శి గువ్వలి వెంకటయ్య, కార్యవర్గ సభ్యులు బద్దుల ప్రవీణ్‌కుమార్‌యాదవ్‌, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శశిరేఖ, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి తిరుమల్‌యాదవ్‌, కొల్లాపూర్‌ బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్‌ పరుశరామ్‌, జిల్లా కార్యదర్శులు లింగస్వామి, నాయకులు భాను, శ్రీకాంత్‌, మెరుగురాజు, శేఖర్‌, సతీష్‌, సిద్దు, రాగె భరత్‌కుమార్‌, మల్లేష్‌, జగదీశ్‌, మార్కండేయ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-23T04:59:01+05:30 IST