వేధింపుల్లో భాగమే అక్రమ కేసులు

ABN , First Publish Date - 2020-07-18T11:09:46+05:30 IST

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించడం సరైన చర్య కాదని కొండపి ఎమ్మెల్యే డీబీవీఎస్‌ స్వామీ మండిపడ్డారు.

వేధింపుల్లో భాగమే  అక్రమ కేసులు

కొండపి ఎమ్మెల్యే డీబీవీఎస్‌ స్వామీ

టీడీపీ యువనేత సత్య, శ్రేణులతో కలిసి

తాలూకా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన

ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి మాట్లాడిన  చంద్రబాబు, లోకేష్‌


ఒంగోలు (క్రైం), జూలై 17: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించడం సరైన చర్య కాదని కొండపి ఎమ్మెల్యే డీబీవీఎస్‌ స్వామీ మండిపడ్డారు. శుక్రవారం ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో నాయుడుపాలెంకు చెందిన తొట్టెంపూడి చంద్రశేఖర్‌, ఒంగోలుకు చెందిన సందీ్‌పలపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు అదుపులోకి తీసుకొని దాడి చేయడంపై ఆందోళనకు దిగారు. సందీ్‌పను చితకబాదడంతో పాటు కొంతమంది పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, లేకుంటే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్టేషన్‌ వద్ద ఉన్న సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి లోకేష్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.


టీడీపీ కార్యకర్త సందీప్‌ అరె్‌స్టపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ అరె్‌స్టను ఖండించడంతో పాటు సందీ్‌పను కొట్టిన పోలీసులపై చర్యలకు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకుడు దామచర్ల సత్యతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ చెన్నైలో జరిగిన ఘటనపై మూడు రోజులుగా తమిళనాడు మీడియాలో, సోషల్‌ మీడియాలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డిలపైన అనేక పోస్టింగ్‌లు వచ్చాయన్నారు.


సోషల్‌ మీడియాలో తొలిసారి పోస్టింగ్‌లు పెట్టిన వారిపైన కేసులు నమోదు చేస్తారన్నారు. ఆ పోస్టింగ్‌లను తెలిసో తెలియకో షేర్‌ చేసిన వారిపై కేసులు సరైనది కాదన్నారు. ఎక్కడాలేని విధంగా కావాలని బెదిరించడానికి తెలుగుదేశం కార్యకర్తలపై ఇలాంటి కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో టీడీపీ వారిపై అనేక పోస్టింగ్‌లు వైసీపీ వారు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే వారిపై అప్పుడు తాము కేసులు పెట్టిన పరిస్థితి లేదన్నారు.


పోలీసులు కూడా ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం సరైందికాదని హితవుపలికారు. అనంతరం డీఎస్పీ ప్రసాద్‌, సీఐ లక్ష్మణ్‌ను కలిసి చర్చించారు. ఆయన వెంట టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్‌, ఒంగోలు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొడ్డు భాస్కర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా మాజీ సీఎం చంద్ర బాబు ఈ విషయమై ఎస్పీ సిద్థార్ధ కౌశల్‌కు లేఖ రాశారు. టీడీపీ కార్యకర్తలపై దాడికి బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.

Updated Date - 2020-07-18T11:09:46+05:30 IST