అక్రమ వెంచర్లపై విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2021-12-26T03:56:58+05:30 IST

కాగజ్‌నగర్‌ మండలంలోని బోరిగాం శివారులో 140, 152 సర్వే నంబర్లలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై సమగ్ర విచారణ చేపట్టి భాద్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు.

అక్రమ వెంచర్లపై విచారణ చేపట్టాలి
మాట్లాడుతున్న బీఎస్పీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్‌ హుస్సేన్‌

  - బీఎస్పీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్‌ హుస్సేన్‌
కాగజ్‌నగర్‌, డిసెంబరు 25: కాగజ్‌నగర్‌ మండలంలోని బోరిగాం శివారులో 140, 152 సర్వే నంబర్లలో  ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్లపై సమగ్ర విచారణ చేపట్టి భాద్యులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి అర్షద్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు.  స్థానిక బోరిగాం శివారులో శనివారంఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూమిలో అక్రమ వెంచర్ల చేపడుతున్న వారిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ క్షేత్ర స్థాయిలో సర్వేలు చేపట్టి వెంచర్ల నిర్మాణం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన లు చేపడతామన్నారు. అక్రమ వెంచర్ల విషయమై రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ దందాలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నదని ఆరోపించారు. నిరుపేదలకు కేటాయించిన భూములు వారికే చెందేలా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-26T03:56:58+05:30 IST