IMD warns: జులై 30 వరకు పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-07-28T18:23:30+05:30 IST

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు పలు సమీప రాష్ట్రాల్లో ఈ నెల 30వతేదీ వరకు భారీవర్షాలు...

IMD warns: జులై 30 వరకు పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు

న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తోపాటు పలు సమీప రాష్ట్రాల్లో ఈ నెల 30వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) బుధవారం హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జులై 28,29 తేదీల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గిరిజన జిల్లా అయిన లాహౌల్ స్పితిలో బుధవారం సంభవించిన మెరుపు వరదల్లో 10మంది గల్లంతయ్యారు.జమ్మూకశ్మీర్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లలో నూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. కొంకణ్, గోవా, మహారాష్ట్రలలో ఆగస్టు 1వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తన బులిటిన్ లో పేర్కొంది. 

Updated Date - 2021-07-28T18:23:30+05:30 IST