ఇమ్యూనిటీ స్మూతీలు

ABN , First Publish Date - 2020-08-12T05:30:00+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. విటమిన్‌ సి, ప్రొ బయాటిక్స్‌ సమృద్ధిగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల...

ఇమ్యూనిటీ స్మూతీలు

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం రోగనిరోధక శక్తిని పెంచుకోవడం. విటమిన్‌ సి, ప్రొ బయాటిక్స్‌ సమృద్ధిగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంటి వద్ద తయారుచేసుకున్న ఇమ్యూనిటీ డ్రింక్స్‌తో రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. వాటి తయారీ ఎలాగంటే...


కివీ లేదా నారింజ స్మూతీ: ఈ స్మూతీ తయారీకి కివీ లేదా నారింజతో పాటు నిమ్మరసం, యోగర్ట్‌, దాల్చినచెక్క, అల్లం అవసరమవుతాయి. వీటన్నింటినీ మిక్సీలో వేసి స్మూతీ తయారుచేసుకోవాలి. చల్లదనం కోసం కొద్దిగా ఐస్‌ వేయాలి. స్మూతీ చిక్కగా రావాలంటే ఒక అరటిపండు వేస్తే సరి. 

గ్రీన్‌ స్మూతీ: పాలకూరను పప్పులోనో, కూరగానో కాదు స్మూతీగానూ తాగొచ్చు. కొద్దిగా పాలకూర, పైనాపిల్‌, నిమ్మరసం, ముక్కలుగా కోసిన తాజా అల్లం, బాదం పాలు లేదా యోగర్ట్‌... వీటన్నింటినీ మిక్సీలో స్మూతీలా చేసుకోవాలి. గ్రీన్‌ స్మూతీ తాగితే పోషకాలతో అందడంతో పాటు, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. 

పసుపు, అల్లం: కశ్మీరీ కవా (ఒక రకం టీ పొడి), పసుపు, అల్లం, కొన్ని బాదం పలుకులు తీసుకోవాలి. వీటిని మిక్సీ పట్టి స్మూతీ సిద్ధం  చేసుకోవాలి. స్మూతీ తీయగా కావాలంటే కొద్దిగా తేనె వే యాలి. పసుపులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫెక్షన్లను దరిచేరనీయవు.


Updated Date - 2020-08-12T05:30:00+05:30 IST