రిమ్స్‌లో అంధకారం

ABN , First Publish Date - 2021-07-30T05:59:19+05:30 IST

ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో అంధకారం నెలకొంది. రెండుసార్లు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా సరఫరాలో ఇబ్బందులు ఎదురుకావడంతో గురువారం సాయంత్రం 7 గంటల నుంచి కరెంటు పోయింది. దీంతో కొవిడ్‌ బాధితులకు సమస్య ఎదురైంది. దీంతో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్న వారు ఇబ్బందులు పడ్డారు. గంటసేపు చీకటిలోనే ఉండాల్సి రావడంతో పలువురు బాధితులు రిమ్స్‌ వైద్యాధికారులకు సమచారం అందించారు. సమస్యను గుర్తించిన అధికారులు స్పందించి చర్యలు చేపట్టడంతో తిరిగి 8.30కు విద్యుత్‌ను పునరుద్ధరించారు.

రిమ్స్‌లో  అంధకారం
చీకట్లోనే రోగులకు సేవలు అందిస్తున్న సిబ్బ ంది

 నిలిచిపోయిన విద్యుత్‌ 

  కొవిడ్‌ బాధితుల అవస్థలు

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 29 : ఒంగోలు రిమ్స్‌ ఆసుపత్రిలో అంధకారం నెలకొంది. రెండుసార్లు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా సరఫరాలో ఇబ్బందులు ఎదురుకావడంతో గురువారం సాయంత్రం 7 గంటల నుంచి కరెంటు పోయింది. దీంతో కొవిడ్‌ బాధితులకు సమస్య ఎదురైంది. దీంతో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లపై ఉన్న వారు ఇబ్బందులు పడ్డారు. గంటసేపు చీకటిలోనే ఉండాల్సి రావడంతో పలువురు బాధితులు రిమ్స్‌ వైద్యాధికారులకు సమచారం అందించారు. సమస్యను గుర్తించిన అధికారులు స్పందించి చర్యలు చేపట్టడంతో తిరిగి 8.30కు విద్యుత్‌ను పునరుద్ధరించారు. మరలా సమస్య తలెత్తి రాత్రి 9.30కు మరలా అంతరాయం ఏర్పడింది. సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఎలాగోలా 11.30కు ఐసీయూ వార్డు వరకు సరఫరాను పునరుద్ధరించారు. మిగతా ఆస్పత్రి అంతా అంధకారంలోనే ఉంది. బాధితులకు చీకట్లోనే సెల్‌ఫోన్‌ వెలుగుల్లో డాక్టర్లు వైద్యసేవలందించారు. 



Updated Date - 2021-07-30T05:59:19+05:30 IST