మూడేళ్ల పాలనలో.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి

ABN , First Publish Date - 2022-04-07T05:13:50+05:30 IST

‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, చేతకాని పాలనతో రాష్ట్రం మూడేళ్లలో 30 ఏళ్లు వెనక్కి పోయింది. 5వ తేదీ వచ్చినాకూడా ఇంకా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇస్తేనే జీతాలు ఇచ్చేది. ఆ అప్పు తీర్చేందుకు మరో అప్పు చేస్తూ వడ్డీలకే లక్ష కోట్లు చెల్లించే పరిస్థితి దాపురించింది’’ అని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం

మూడేళ్ల పాలనలో.. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి
మాట్లాడుతున్న ఆర్‌.శ్రీనివాసరెడ్డి

ప్రజలు తిరగబడాలి

టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి 

కడప, ఏప్రిల్‌6 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, చేతకాని పాలనతో రాష్ట్రం మూడేళ్లలో 30 ఏళ్లు వెనక్కి పోయింది. 5వ తేదీ వచ్చినాకూడా ఇంకా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇస్తేనే జీతాలు ఇచ్చేది. ఆ అప్పు తీర్చేందుకు మరో అప్పు చేస్తూ వడ్డీలకే లక్ష కోట్లు చెల్లించే పరిస్థితి దాపురించింది’’ అని టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కడపలోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ అస్తవ్యస్త నిర్ణయాలతో రాష్ట్ర పరిస్థితి దిగజారిందన్నారు. జనం తిరగబడకపోతే ఈ ఏడాదే రాష్ట్రంలో శ్రీలం పరిస్థితి వస్తుందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పానలో రాష్ట్రాన్ని ఐదేళ్లు ముందుకు తీసుకెళ్లారన్నారు. లోటు విద్యుత్‌ను భర్తీ చేసి 24 గంటలు కరెంట్‌ సరఫరా చేశారన్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పైసా చార్జీ పెంచలేదన్నారు. కానీ జగన్‌ మూడేళ్లలో 7 సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. సీఎం జగన్‌ ఢిల్లీకి వెళుతుంటారని.. ప్రత్యేక హోదా గురించి, ఉక్కుఫ్యాక్టరీ గురించి, వెనుకబడిన రాయలసీమ నిధుల గురించి మోదీ, అమిత్‌షాలతో ఏమైనా చర్చించారా అని ప్రశ్నించారు. చర్చించి ఉంటే ఎందుకు ఢిల్లీ టూర్‌ విషయాలను మీడియాకు వెల్లడించలేదని అన్నారు. రాష్ట్రం కోసం కాదని కేవలం కేసుల నుంచి బయటపడేందుకే ఢిల్లీ టూర్‌ వెళుతున్నారని అన్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలను గాలికి వదిలేసి లిక్కర్‌, మైనింగ్‌, సాండ్‌ మాఫియాలో మునిగి తేలుతున్నారన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదన్నారు. రాజకీయపర నిర్ణయాలతో విభజన జరిగిందన్నారు. కొత్త జిల్లాల్లో భవన నిర్మాణాలు ఏడాది లోపు కట్టాలన్నారు. అసలే ఆర్థికలోటు ఉన్న రాష్ట్రానికి జిల్లాల విభజన అవసరమా అన్న చర్చ జనాల్లో సాగుతోందన్నారు.

Updated Date - 2022-04-07T05:13:50+05:30 IST