పీఎఫ్‌ సమస్య పరిష్కరించలేని అసమర్థ సీఎం జగన్‌

ABN , First Publish Date - 2021-01-17T06:02:16+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌ సమస్య పరిష్కరించలేని అసమర్థ సీఎం జగన్‌ అని పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు.

పీఎఫ్‌ సమస్య పరిష్కరించలేని అసమర్థ సీఎం జగన్‌
మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్వరరావు

ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్‌


అనకాపల్లి, జనవరి 16: ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌ సమస్య పరిష్కరించలేని అసమర్థ సీఎం జగన్‌ అని పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జీతాల నుంచి దాచుకున్న కోట్లాది రూపాయల నిధులను సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించి ఉద్యోగులను నిట్టనిలువునా సీఎం ముంచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పక్షపాతిలా ఎన్నికల ముందు బహిరంగ సభల్లో మాట్లాడారని, ఇప్పుడు వారికి ఏడు డీఏ బకాయిలు పెట్టడం సరికాదని చెప్పారు. సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన ఆరు రోజుల్లోనే సీపీఎస్‌ రద్దు చేస్తానని అబద్దపు ప్రచారాలతో అధికారంలోకి వచ్చి ఉపాధ్యాయులను మోసగించడం దారుణమని బుద్ద పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T06:02:16+05:30 IST