వ్యాక్సిన్ల పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతాం

ABN , First Publish Date - 2021-05-19T07:22:15+05:30 IST

దేశంలో వ్యాక్సిన్ల పంపిణీ సామర్థ్యాన్ని భారీ స్థాయిలో పెంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు

వ్యాక్సిన్ల పంపిణీ సామర్థ్యాన్ని పెంచుతాం

అందుకు నిరంతరం శ్రమిస్తున్నాం: మోదీ


న్యూఢిల్లీ, మే 18: దేశంలో వ్యాక్సిన్ల పంపిణీ  సామర్థ్యాన్ని భారీ స్థాయిలో పెంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే వ్యాక్సిన్ల కేటాయింపుల గురించి రాష్ట్రాలకు 15 రోజుల ముందుగానే సమాచారం అందిస్తున్నామని, దీంతో దాన్ని అనుసరించి సమర్థంగా ప్రణాళిక రూపొందించుకునే వీలు ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయో, అందుకోసం ఏయే ఏర్పాట్లు చేసుకోవాలో ముందుగానే నిర్ణయాలు తీసుకోవచ్చని చెప్పారు. కరోనాపై పోరాడి విజయం సాధించడానికి వ్యాక్సినేషన్‌ ఓ చక్కని మార్గమని చెప్పారు. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లోని 46 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మంగళవారం మోదీ వర్చువల్‌ పద్ధతిలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ కొవిడ్‌-19 విజృంభిస్తోందని, దానిపై పోరులో రాష్ట్రాల అధికారులే క్షేత్రస్థాయి కమాండర్లని మోదీ అన్నారు. కరోనా కట్టడికి భారీగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం, వైరస్‌ సోకే అవకాశాలున్న వారిని గుర్తించి జాగ్రత్తలు తీసుకునేలా చేయడం,  కచ్చితమైన సమాచారాన్ని ప్రజల ముం దుంచడం వంటి చర్యలు కీలక ఆయుధాలని చెప్పారు.  

Updated Date - 2021-05-19T07:22:15+05:30 IST