పెరిగిన కరెంట్‌ చార్జీలను మాఫీ చేయాలి

ABN , First Publish Date - 2020-05-23T10:38:01+05:30 IST

కరోనా కష్టకాలంలో ప్రభు త్వం వివిధ శ్లాబుల కిం ద కరెంటు చార్జీలను పెంచడం దారుణమని, వెంటనే

పెరిగిన కరెంట్‌ చార్జీలను మాఫీ చేయాలి

అనంతపురం విద్య/ వైద్యం, మే 22 : కరోనా కష్టకాలంలో ప్రభు త్వం వివిధ శ్లాబుల కిం ద కరెంటు చార్జీలను పెంచడం దారుణమని, వెంటనే పెంచిన చార్జీల ను మాఫీ చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గౌస్‌ మొహిద్దీన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెంచిన చార్జీలపై ఆయన, పలువురు టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ వల్ల సుమారు రెండు నెలలకు పైగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. పూట గడవక  ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కరెంటు చార్జీలు పెంచడం దారుణమ న్నారు. నిరుపేద ముస్లింకు రంజాన్‌ పండుగ నేపథ్యంలో రూ. 10 వేల ఆర్థిక సాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జాఫర్‌, సాదిక్‌, గౌస్‌, పీరా, ఫకృద్దీన్‌, చోటు, డిష్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-23T10:38:01+05:30 IST